పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

125


బాండురాంభోజంబు పుండరీకం బయ్యె
        భాస్వన్మయూరంబు బర్హి యయ్యె
చర్చింపఁగా హిమజలము విషం బయ్యె
        నవ్యమౌ పొన్న పున్నాగ మయ్యె
విమలప్రసూనరజము పరాగం బయ్యె
        గురుచక్రవాకంబు కోక మయ్యె


గీ.

ఘనవియోగాంబునిధిమగ్నతనున కిట్లు
లీల 'దైవీబలే దుర్బలే' యటన్న
గతిని సుఖదంబులెల్ల విక్రమము లగుచు
నహహ! వలవంత బలవంతమయ్యె నకట.

210


సీ.

చెలిమాట లందితే చిలుకలారా! మీకు
        దాడింబవనమెల్ల ధార వోతు
చానగానము వింటినేని కోవెలలార!
        మాకందవని సర్వమాన్య మిత్తు
దెరవనడ ల్జూచితే యంచలార! కా
        సారతీరము లగ్రహార మిత్తు
సతికొప్పు వీక్షింపజాలితే నళులార!
        తావి క్రొవ్విరిపొద ల్దాన మిత్తు


గీ.

సుదతియవయవసంశ్లేష లొదివెనేని
ఘనదళాంబుజమధురసంబులను మీకు
సంతసంబున నివ సంతసంబు నందె
జాతర లొనర్తు మానసోత్సవము గూర్తు.

211


సీ.

తతపరాక్రమమహోద్ధతి దొలంగని మేను
        తొందరగా కంప మందనయ్యె '
పటుకార్యధుర్యశుంధత్కౌశలమనంబు
        తుదలేనికళవళం బొదువనయ్యె