పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

117


సీ.

ఘనమృణాళగ్రాసమున గ్రొవ్వు రాయంచ
        కూనలుఁ గన్న లేగ్రుడ్డు లనఁగ
భాస్వన్మయూఖిసంస్పర్శచే జనియించుఁ
        గలితసానందాశ్రుకణము లనఁగ
పటునిశాసమయసంభవితచంద్రాతపం
        బున జనించిన వేడిబొగ్గ లనఁగ
నురుతరభ్రమరనాదోచ్చారణత్వర
        రాలిన వాక్శీకరంబు లనఁగ


గీ.

బద్మవనలక్ష్మినిజదివ్యభవనములను
కమ్రగతినుంచు వజ్రశిఖరము లనఁగఁ
దరళతారుణ్యనీరేజదళములందుఁ
బ్రవిమలంబైన తుహినబిందువులు బొలిచె.

176


సీ.

మెఱుఁగువెన్నెలతీరు మేనఁబూసిన నీఱు
        గొనబుటంచలతండ పునుకదండ
తలిరుపుప్పొడిమూఁక తలమీఁద గలవాక
        జలజరాగఁపుసొంపు జడలగుంపు
కల్హారములవిప్పు కంటనంటిననిప్పు
        కడిమిమ్రాన్ దుటుము మేల్కలభపటము
సితకైరవమతల్లి సికలోనిజాబిల్లి
        కొలఁకుల చెలువమ్ము చిలువసొమ్ము


తే.

పొసఁగఁ బుష్పాస్త్రుఁ డభవుని బూజసేయు
భక్తికి నిజస్వరూపంబు భ్రమరకీట
కప్రకారంబున నొసంగుగతిని నిట్టు
లగుచు లోకైకగర్వనిర్హరణుఁ డయ్యె.

177


చ.

పలుమరు హంససంఘముల బాధలువెట్టిన వార్షధార లా
జలనిధి కెప్పటట్లఁ జన జయ్యన కుంభజహంసు డబ్ధిమున్
గలఁచినవాఁడు మమ్మెటుల గాచును నామతదైక్యవైరమే