పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

తాలాంకనందినీపరిణయము


సీ.

వనితలేనవ్వుతో నెనయు వెన్నెలఁ జూపి
        నెవదీర్తుఁ గువలయనేత కనియొ
పొలఁతి వాల్గన్నుల బోల్దామరలఁ జూపి
        మురిపింతు సరసశేఖరుని యనియొ
మగువయారును బోలు మదరేఖయును జూపి
        దనియింతు పున్నాగమునకు ననియొ
కలికినాభిని బోలఁ గలగొలంకుల జూపి
        భ్రమగూర్తు రాజమరాళి కనియొ


తే.

గాక యుండిన జగతి నల్గడల మించి
మెఱుఁగువెన్నెలగాయ తా మొఱలుజేయ
కొలఁకులకు నెల్ల ముదము దంతులకు మదము
గదర నేతెంచె వరశరత్కాల మపుడు.

172


మ.

శరజన్మప్రహతవ్రణశ్రమను నిచ్చల్ జెందఁగా గంధసిం
ధురదంతాహతి పెల్లుగా నెగయ నందుం గల్గు నెమ్ముల్మహో
ద్ధురతం జాఱినరీతిగా సితగురుస్తోమంబులం గ్రౌంచభూ
ధరరంధ్రాంతరమందునుండి వెడలెం దద్రాజహంసావళుల్.

173


ఉ.

క్రౌంచమహామహీధ్రవివరం బిఱువంకలనుండి వచ్చు రా
యంచలపంక్తి యొప్పె శరదంగనకంఠమునందు మౌక్తికో
దంచితహారము ల్బలెనె యందు సరోవరదీప్తి కొల్కిఁగా
నుంచినబూసయుం బలెనె యొప్పెఁ ద్రిలోకమనోహరాకృతిన్.

174


చ.

తొలుతటిప్రావృడాగమముతోడ నిరస్తముజెందు నీపవం
జులము ఖరద్రుమవ్రజవిశుద్ధపునసృజనైకభావుఁడై
నలినభవుండు భూస్థలమునం డిగియుండెనొ గాక యున్నకే
వలధవళచ్ఛవిన్ ద్రుహిణవాహనము ల్ధరనుండ నేటికిన్.

175