పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

తాలాంకనందినీపరిణయము


సీ.

మరువక చక్రిసంస్మరణయే గావించుఁ
        గలికికీల్జడ పొడగట్టినపుడు
తోడనే పూర్ణవిధుధ్యాన మొనరించు
        నింతినెమ్మోము నూహించునపుడు
మతిలోన శ్రీధరస్థితి చింతనమొనర్చుఁ
        తరుణిచన్గవఁ బుద్ధిఁ దలఁచినపుడు
తరలక హరిపదధ్యానమే యొనరించు
        వెలఁదిలేఁగౌను భావించినపుడు


తే.

పరుల తలయెత్తి చూడఁడు పలుకనోపఁ
డితర మేమాట విననొల్లఁ డెచట నిల్వఁ
డా రతీశ్వరవిగళితస్మారకప్ర
సక్తి వివిధానుభోగవిరక్తుఁ డగుచు.

148


చ.

జలధరమేచకాలకను జంచలలోచన నాత్మలోన నె
క్కొలిపెఁ దదీయకాంతిఁ గనగోరిన నానృపసూతికిం తదు
జ్జ్వలతరకాంతు లిట్టివని జక్కఁగ జూపి ముదం బొనర్తునం
చలవడినట్లుగాఁగ జలదాగమముం గనుపట్టె నత్తఱిన్.

149


సీ.

భూరిజలోత్తీర్ణభుజగావలోకనా
        భీతమండూకసంఘాతరవము
భీతమండూకసంఘాతాభయప్రద
        కేకారవాహ్వానకేకికులము
కేకారవాహ్వానకేకీగణప్రార్థ
        నాయాతపటుగర్జితాభ్రచయము
నాయాతపటుగర్జితాభ్రసంతోషిత
        కలనాదనుతచాతకవ్రజంబు


గీ.

చాతకాశనిసంపాతఘాతనాతి
భీతచేతోమరాళసంఘాతములకు