పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

109


క.

[1]అనయాల నింక నీతో
వినయాదిమసద్గుణాభివృత్తులయెడలన్
మనయాదవులకు గలవం
తన యామరవలదు వినుము తనయా! సనయా!

142


చ.

హలధరుఁ డిట్లు కూర్మి తనయామణి నంతిపురంబులోపల
న్నిలిపిన చేటికాజను లనేకులుఁ గొల్వఁగ నిల్చి బుద్ధిలో
పల నభిమన్యు జూచు టెడబాయుట కీయవరోధబాధ నా
కలవడె నంచు దర్పకశరాహతమానసయై వసింపఁగన్.

143


ఉ.

అంతట సవ్యసాచిసుతుఁ డాశశిరేఖ గృహాంగణంబునం
దెంతయులేమి యూడిగపుటింతులవల్న బలుండు రాణివా
సాంతరసీమలో నిలుపు యొసంగినవార్త వించు నం
తంత లతాంతకుంతవిశిఖాహతమానసుఁ డౌచు భీతుఁడై.

144


ఉ.

బాలిక నిన్నినా ళ్ళొకటఁ బాయక వర్తిలునంత యౌవన
శ్రీ లభియింప కోర్కె లికఁ జేకురునో యనిజూడ శత్రువుం
బోలిన రాణివాసమని బుట్టెను నామనసైనదీర నా
హా! లికుచస్తనిం గనులనైన గనుంగొన నోచనైతినా.

145


చ.

అని వనితామణిం దలఁచి హా! యని చింతిలు వెచ్చనూర్చు చెం
తను చెలి గాంచినట్లయిన దాల్మి వహించు చలించు నంతలో
మనమున నీతిగాంచు మరుమాయ లటంచు దలంచు నింతి నే
యనువున జూతునంచును దదాకృతులెల్ల గణించుచుండఁగన్.

146


క.

వలరాజు వలన బొలిచెటి
యలరుల దూఁపులకు విలువనలనిగనక న
క్కలకంఠకంఠిపైఁ గల
వలపోపక మందిరోపవనముం జేరెన్.

147
  1. మొదటి చరణము 'అననేల', నాల్గవ చరణము 'యేమరవలదు' అని.