పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

తాలాంకనందినీపరిణయము


కృతాశ్వాసంబై గ్రీష్మసమయంబుభాతి కేవలతాపోపయోగ్యంబై బ్రదోష
కాలంబురీతి విప్రలాపాధికంబై తురుష్కనాయకశృంగారంబుబోలె
విచ్ఛిన్నాలంకారంబై యున్న సమయంబున.

136


మ.

బలభద్రుం డొకనాఁడు హేమమయశుంభత్సౌధభాస్వద్విధూ
పలవేదిన్ మణిభద్రపీఠముస జెల్వంబొప్ప నాసీనుఁడై
లలనారత్నము రేవతీరమణి లీలం జేరి సేవింప సం
కలితామోదత నాత్మపుత్రి శశిరేఖం బిల్చి దా నిట్లనెన్.

137


చ.

సుగుణవతీమతల్లి చెవిసోఁక వినందగునమ్మ మత్ప్రియం
బగు వచనంబు లియ్యకొని యంతిపురంబున రాణివాసముం
దగ వసియించుటల్ సతులధర్మము గావున నీవు స్వేచ్ఛ నిం
పుగఁ జరియించగూడ దిట మున్ను శిశుత్వములీల పుత్రికా.

138


క.

ఇన్నాళ్ళు శైశవక్రియ
నున్నటులం గాదు యౌవనోదయమున రా
కన్నియలు రాణివాసం
బున్నతెఱంగునను నీ వటుండఁగవలయున్.

139


చ.

పరులను జూడరాదు బహుభాష లతిధ్వని బల్కరాదు నం
దరు విన నవ్వరాదు యిలుదాటి బహిస్థలి నొంటిపాటునం
దిరుఁగగరాదు ధావనగతిం గమియింపఁగరాదు దాసినే
మరి విడనాడరాదు వినుమా యవరోధవధూటికోటికిన్.

140


క.

కొమ్మా! నాయానతి గై
కొమ్మా! యిక శైశవగోష్టిని విడుమో
యమ్మా! ముమ్మాటికి మీ
యమ్మలతో రాణివాస మట నిలువమ్మా.

141