పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 ~< .9)ΨΤ Ο స్వయ చ రి త్ర ము గోరుదురు ? ఎల్లవారల హృదయములయందు నదృశ్యముగా నడుచుచున్న యద్భుతమైన మార్పును జూడఁగా నిదియేమో మహేంద్రజాలమువలెఁ סרכסס. గానఁబడుచున్నది. ఇంగ్లీషువిద్యయొక్కయు నింగ్లీషు ప్రభుత్వముయొక్క_యు ఘనతను శ_క్తిని ఘోషించుటకయి యింతకంటె వే పేలిమి కావలెను ? ఈవఱకు దేశమునకు సంప్రాప్తములయిన ప్రభుత్వములలో నెల్ల నీ యింగ్లీషు దొరతనము సర్వోత్కృష్టమయినదని భూపించుటచేత దీనియందే విధమయిన లాపములును లేవని నేను చెప్పఁదలఁచినవాఁడను గాను. ప్రపంచ ములాగని దేదియు సంపూర్ణముగా నిర్దుష్టమయి యుండదు, ఇంగ్లీషు ప్రభుత్వము నందును లోపము లనేకము లున్నవి.” పాలు గారి యుపన్యాసములవలనఁ గలిగిన దేశాభిమానము యుక్తా యుక్త వివేకము లేక యింగ్లీషువారిని వారి ప్రభుత్వమును గరించుటయేకాక యింగ్లీషు ప్రభుత్వపకమున మంచిమాటచెప్పిన వారిని దూషించువఱకును వచ్చినది. ఈ యువజనులదృష్టియం దింగ్లీపువారిని దూషించినవాఁడెల్లను విద్య లేనివాఁడయినను సద్వర్తనము లేనివాఁడయినను దేశాభిమాన మాననీయుఁ డు"గా కనఁబడుచుండెను ; హత్యచేసినవాఁడయినను చేసిన హత్య ΟΟΦΟ గ్లీషు వానినైన పకమున పూజనీయుఁడు"గా నుండెను ; ప్రార్థన సమాజ ప్రముఖు లలూrt నొక్కరైన నాళముకృష్ణరావుగారు రాజద్రోహియునరహంతకుఁడునైన కుదిరాంబోసుయొక్క ఛాయాపటమును దెచ్చి పురమందిరములోనా పేరిటనున్న పఠనమందిరములో (వేలాడదీయుటయే కాక యెవరు చెప్పినను దానిని తీసి చేయకపోయెను. ఇది యాధారముచేసికొని నా ప్రతిపతులుగా నున్నవారు రాజద్రోహులసమూహమునకు "నేను నాయకుఁడనని కరగ్రాహి మొదలయిన యూరపియనులతోఁ జెప్పఁజొచ్చిరి. ఈపటమునుగూర్చి యదియేల పఠన మందిరములో తగిలింపఁబడినదో తెలుపవలసినదనిమండలకరగ్రాహి నా పేరు వా సెను. నాళము కృష్ణరావుయొక్క యవివేకమువలన పటమందు తగిలింపఁబడి సోరువాత వీసివేయఁబడినదనియును ఊరక నాపేరుపెట్టుటయేకాని యూపతన మందిరమునకును నాకును సంబంధమేదియు లేదనియు, శ్రీల కుపయుక్తము