పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ూ5 స్వీయ చ రి త్ర ము ముద్రాకరశాలను చిత్రపు నరసింహారావుగారి కమివేయుటయే కాక నా మిత్రులయిన న్యాపతి నుబ్బారావు పంతులవారియొద్ద వేయి రూపాయల ఋణము చేయవలసిన వాఁడనైతిని. నే నడిగినందునను నా తో డ్పాటు లేక చింతామణి పత్రికను రాజమహేంద్రవరములో నడపుట కష్టముగా కనఁబడి నందునను ను బ్బారావు పంతులుగా రాపత్రికను చెన్నపురిలో నడుపుటకు నా కిచ్చివేసిరి. నే నింగ్లండునకు వ్రాసి యావిరితో పని చేయుటకు తగిన మంచి ముద్రాయంత్రమును చెన్నపురికి తెప్పించి యుంచి దానికి చింతామణీ ముద్రాకరశాల యని పేరు పెట్టితిని, ఆరంభములో నున్నత పాఠశాలకంటె సెక్కువ పాఠశాల లేకపోవు టచేత విద్యావ్యా ప్తి తక్కువగా నుండినట్టియు చిరకాల మయోమార్ల సంబం ధము సహితము లేకపోవుటనుబట్టి నవనాగరికతా సంపర్కము కొఱవడి యుండినట్టియ Nచావరీ పుణ్యనగీ ప్రాంతమగుటచేత ఛాందస బ్రాస్త్రణ మండలితో నిండియుండి కర్మరతులకు నివాసమయి నవాచార విద్వేషమునకు ప్రసిద్ధికెక్కినట్టియు మాఱుమూలనున్న రాజమహేంద్రవరమునందు సంఘ సంస్కార కార్యము నారంభించితిని. ఊషర క్షేత్రమునందు బీజావాసము చేసి పెంటకట్టి రేయింబగళ్లు కష్టపడు కర్షకుని కృషి వలె నాకృషి యిక్కడ నా కోరికకు తగినంత ఫలదాయకము కాక పోవుటచేత, చిరకాలమునుండి సర్వకళాళాలాది సమస్త విద్యాలయములకును నిలయ మగుటచేత విశేష విద్యా వ్యాప్తి కలిగియుండినట్టియు నానా ముఖములనుండి వచ్చి సంధించెడి యయో మార్గములచేతను ఖండాంతరములనుండి సహితము వారవారమును వచ్చెడు ధూమనౌకలచేతను వివిధ నవనాగరిక జనతా సంసర్గము కలిగియుండినట్టియు వివిధ దేళాగత వివిధాచార వివిధమత వివిధవ్యవహార సమిశ్రమగుటచేత పూర్వా చార పరాయణ శుద్ధ శ్రోత్రియ జన సమాకీర్ణము కానట్టియు రాజ్యమధ్యస్థ మయి సముద్రతీరమున నున్న చెన్నపట్టణమందు నాకృషి సారవంతమైన దివ్యక్షేత్రమునందు విత్తనములు చల్లిన కృషీవలుని కృషి వలె శీఘ్రకాలములో ననాయాసముగా విశేషఫల ప్రదమగు నని నమి నేను చెన్నపురిలోనే స్థిర