పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

స్వీయ చరిత్రము.

మునుండి పెట్టుటకును, పనివాండ్రజీతములు మొదలైనవ్యయములు పోఁగా మిగిలినలాభమును భాగస్థులాఱుగురును సమముగా పంచుకొనుటకును, మొట్టమొదట మాలో మే మేర్పాటు చేసికొంటిమి. అయినను మే మనుకొన్నట్టు గా ముద్రాయంత్రమువలన లాభము రాలేదు. వచ్చిన యాయమును వివేకవర్ధనికి వచ్చినచందాలమొత్తమును గలిపినను పనివాండ్రజీతములకే చాలిచాలక యుండెను. ఒక్కొక్క నెలలో మాచేతొసొమ్ము సహిత మిచ్చుకోవలసి వచ్చుచుండెను. అప్పుడు స్థలనిధిసంఘముల వారియొక్కయు పురపారిశుద్ద్యవిచారణసంఘముల వారియొక్కయు అచ్చుపను లన్నియు దొరతనమువారి ముద్రాయంత్రములోనే జరగవలసియుండుటచేత మాకాపని యేదియురాలేదు. ఇతరులును వివాహాదులయందు శుభలేఖలు వేయించుకొనుటతప్ప మాకు వేఱుపని యేదియు నియ్యలేదు. అయినను వివేకవర్ధనిని ముద్రించుకొనుట కాను కూల్య మధికముగాఁ గలిగినందున నాకదియే లాభముగానుండెను. ఆరంభదశలో భాగస్థులందఱునుగూడి రెండుసారులు లెక్కలు చూచికొనిరిగాని లాభము లేక చేతిసొమ్మే తగులుచున్నట్టు కనఁబడినందునఁ దామేమైన మరల నిచ్చుకోవలసివచ్చునని తరువాత వారుపేక్షించి యారకుండుచు వచ్చిరి. నేను వివేకవర్ధనిని బ్రకటింపఁ జొచ్చినపిమ్మట నరసాపురములో నా మిత్రులగు మీర్ షుజాయతల్లీఖాన్ సాహేబుగారు 'విద్వన్మనోహారిణి' యను తెలుఁగు మాసపత్రికను బ్రకటింప నారంభించిరి. మాయిరువురకు 1874 వ సంవత్స రాంతమునుండి మైత్రియారంభమై యంతకంతకు వృద్ధినొందెను. శ్రీ వివేకవర్ధని నొకసంవత్సరము నడపినతరువాత విద్వన్మనోహారిణిని దానితోఁ గలిపి వేసి వివేకవర్ధనిలో నింగ్లీషుకూడఁజేర్చి యింగ్లీషుభాగ మాయన వ్రాయుచుండుటకును తెలుఁగుభాగము నేను వ్రాయుచుండుటకును ఏర్పాటు చేసికొంటిమి.

1876 వ సంవత్సరమధ్యము (జూలయి నెల)నుండి వివేకవర్ధనిని పక్షపత్రికనుజేసి నడపఁజొచ్చితిని. ఆనెలలోనే "హాస్యసంజీవని"యనుపేర హాస్య రసప్రధానమైన యొకమాసపత్రికనుగూడ వివేకవర్ధని కనుబంధముగాఁ బ్రచు