పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

85

వెండిపాత్రమును బహుమానము చేసిరి. నే నిప్పుడు మంచినీరు త్రాగుట కుపయోగించునది యప్పుడు వారిచ్చిన రజతపాత్రమే. నేను చెన్న పురిలోనున్న కాలములో వారు నాయుపచారము నిమిత్తమయి బ్రహ్మశ్రీ మన్నవ బుచ్చయ్యపంతులుగారిని నాకప్పగించిరి. అప్పటినుండి నాకాయనతోడిమైత్రి కలిగి నానాట వర్ధిల్లినది. పచ్చప్పగారి శాస్త్రపాఠశాలలో తెలుఁగుపండితులుగా నున్న మ-రా-శ్రీ, కార్మంచి సుబ్బరాయలు నాయఁడు గారు నాకుఁ జెన్నపురిలోఁ గావలసినవన్నియుఁ గొనిపంపుచుండుటకు వాగ్దానము చేసిరి. నేను మరల ధవళేశ్వరమునకు వచ్చినతరువాత ముద్రాయంత్రమును ముద్రాక్షరములను గొనుటలోను పనివాండ్రను కుదిర్చి పంపుటలోను నా కాయనే సర్వ విధములఁ దోడుపడెను. స్వతంత్రుఁడనుగా నుండవలెనన్న యభిలాషముచే తను, పాఠశాలాకార్యనిర్వాహకసభ్యులలో నొకరికిని నాకును వైమనస్యము కలుగుటచేతను, మఱి కొన్ని కారణములచేతను, నేను ధవళేశ్వరములోని యుపాధ్యాయత్వమును మానుకొని 1876 వ సంవత్సరారంభమున స్వస్థలమగు రాజమహేంద్రవరమునఁ బ్రవేశించితిని.

నేను రాజమహేంద్రవరమునకు రాకమునుపే ముద్రాయంత్రము వచ్చి యున్నను, అక్షరములు మొదలగునవి నేను వచ్చిన కొలఁదికాలమునకుఁగాని రాలేదు. అక్షరములు రాఁగానే యేప్రిల్ నెల మధ్యనుండి పని మొదలు పెట్టి మాయింటనే నెలకొల్పఁబడిన స్వీయముద్రాయంత్రమునందే వివేకవర్ధనిని ముద్రింపింప నారంభించితిమి. మాభాగస్వాము లొక్కొక్కరిచ్చిన మున్నూటయేఁబదేసి రూపాయలును చాలకపోయినందున, ముద్రాయంత్రపరికరములు కొనుటకయి నే నియ్యవలసినదానికంటె నూఱు రూపాయలను మొదటనే హెచ్చుగానిచ్చితిని. ముద్రాయంత్రకార్యనిర్వాహకత్వమును నేను వహించి పనిచేయుటకును, నేను పడిన శ్రమనిమిత్తమయి వచ్చిన యాయములో నెనిమిదవపాలు నేనుపుచ్చుకొనుటకును, వచ్చెడు చందాధనము వివేకవర్ధనీ పత్రికావ్యయములకు చాలకపోయెడుపక్షమున శేషమును ముద్రాయంత్రాదాయ