పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

స్వీయ చరిత్రము.



నేర్పఱిచి, ప్రతి సంవత్సరసభయందును తక్కిన కార్యనిర్వాహక సభ్యులను కోరు కొనునట్లు నన్ను వేఱుగకోరనక్కఱలేకయే నేనుశాశ్వతముగా కార్య నిర్వాహక సంఘసభ్యుఁడుగానుండునట్లు నిర్ధారణముచేసిరి. నాకట్టి శాశ్వతాధికారి పదము లేకుండునట్లు చేయవలసినదని లక్ష్మీనరసింహముగారు గుత్తికిపోవుటకు ముందు తామొకవిజ్ఞాపనమును సమాజమునకుఁబంపిపోయిరికాని సమాజము వారాయనకోరికను నిరాకరించిరి. 1887 వ సంవత్సరము నవంబరు నెల 22 వ తేదిని తానుపులవరి శేషయ్యగారిని నల్లగొండ కోదండరామయ్యగారిని అధికధర్మకర్తలను (additional trustees) గా తనతోఁజేర్చుకొన్నట్టు తన నిర్ణయపత్రమునుబంపి, లక్ష్మీనరసింహముగారు రామకృష్ణయ్యగారినిధి ధనమును సంవత్సరమునకు నూటికాఱురూపాయలవడ్డిచొప్పున నీలపల్లిగ్రామముమీఁద బదులిచ్చుటను గూర్చి సమాజమువారినాలోచన యడిగెను. కార్యనిర్వాహక సంఘమువారు 1888 సంవత్సరము జనేవరు నెల 19 వ తేదిని జరగిన తమ సభలో క్రిందినిర్ధారణములుచేసిరి.

"2. That the proceedings of Mr. A. L. Narasimham Garu, trutee of Mr. P. R. W. M. fund, associating with him Messers. Seshiah and Kothanda Ramiah as additional trustees be approved. (శేషయ్యగారిని కోదండరామయ్యగారిని అధిక ధర్మకర్తలనుగా తనతోఁ జేర్చుకొనుచు పైడా రామకృష్ణయ్యగారి వితంతు వివాహనిధి ధర్మకర్తయైన ఏ. ఎల్. నరసింహముగారు చేసినచర్య సమ్మతింపఁబడినది.)

3. That the committee think it is not desirable to invest P.R.W. M Fund on Nilapalli at 6 p. c. they consider it safe it should remain in Govt, securities." (నూటికి ఆఱు వడ్డికి రామకృష్ణయ్యగారి వితంతు వివాహ నిధిని నీలపల్లిమీఁద పెట్టుట కరణీయముకాదని సంఘమువారు తలఁచుచున్నారు; దొరతనమువారి పత్రములలో నుండుటయే క్షేమకరమని వారెంచు చున్నారు.)