పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

343

7. That the trustee or trustees be requested to take the advice of the Widow Marriage Association on all important matters in the disbursements they make out of the sums realized in the way of interest on Mr. Pida Ramakrishnaiah's fund. (పైడా రామకృష్ణయ్యగారి నిధినుండి వడ్డి రూపమున వచ్చెడు సొమ్ములో నుండి వారు చేసెడు వ్యయములలో ముఖ్యమైనవాని విషయము నందెల్లను వితంతు వివాహ సమాజముయొక్క యాలోచన గైకొనుచుండుటకు ధర్మకర్తగాని ధర్మకర్తలుగాని కోరఁబడవలెను.)

8. That the Association record its sense of gratitude for and appreciation of the valuable services by Mr. A. L. Narasimham (now leaving Rajahmundry for Gooty) to promote the widow marriage cause." (ఇప్పుడు గుత్తికి వెళ్లుటకయి రాజమహేంద్రవరమును విడుచుచున్న ఏ. ఎల్. నరసింహముగారు వితంతు వివాహ పక్షాభివృద్ధికయి చేసిన విలువయిన సాహాయ్యమును గుర్తెఱిఁగి తన కృతజ్ఞతా భావమును సమాజము లిఖించుచున్నది.)

పై వానిలోని 1, 3, 4, 5, 6, 7, నిర్ధారణములకు తమయభిప్రాయము నియ్యక లక్ష్మీనరసింహముగారు గోపనముచేసికొనిరి. సభావసానమున లక్ష్మీనరసింహముగారులేచి "సామాజికులారా ! నేను మీయాలోచన నడుగుచుండెదను గాని దానిననుసరించినడుచుకొనుటకు నేనుబద్ధుఁడనుగాను." అనిసెలవిచ్చిరి. ఆయనగుత్తికివెళ్లునప్పుడు రాజమహేంద్రవర సాంగచతుర్వేదసభకని చందాలుచేర్చికొన్న వైదిక ముద్రాయంత్రమును విక్రయించి, రు. 1500 లు చందాలు పోగుచేసి తన్నిమత్తమయికొన్న వైదికపుస్తక భాండాగారమును పురజనులును చందాదారులును కొనిపోవలదని మొఱ్ఱపెట్టుచున్నను వినక తమవెంటఁ గొనిపోయిరి. మాసమాజము మరల క్రొత్తగానేర్పడిన తరువాత జరగిన మొదటి సంవత్సరసభయందే రామకృష్ణయ్యగారిని సమాజమునకు (President) అధ్యక్షునిగాను, నన్ను (Vice-President) ఉపాధ్యక్షునిగాను, యావజ్జీవము