పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

345

కొన్ని మాసములయిన తరువాత లక్ష్మీనరసింహముగారు నీలపల్లిమీఁద ఋణమిచ్చుటవలని లాభములను దెలుపుచు సమాజమువారికి మరల వ్రాసిరి. కార్య నిర్వాహక సంఘము వారావిషయమున 1888 వ సంవత్సరము జూన్ నెల 10 వ తేదిని జరగిన తమ సభలో మరల నీక్రిందినిర్ధారణముచేసి యాయనకుఁ బంపిరి.-

"1. Read Mr. A. L. Narasimham chettiar's proposal to invest the late Pida Ramakrishniah's fund on Nilapalli at 6 p. c. - The committee re-affirm the resolution No. 3 passed in their meeting of the 29th January last. The committee do not consider it expedient to invest P. R. W. M. fund on immoveable property in preference to Govt. securities." (నూటి కాఱు రూపాయలవడ్డికి గతించిన పైడా రామకృష్ణయ్యగారి నిధిని నీలపల్లిమీఁదఁ బెట్టుటకయి ఏ. ఎల్. నరసింహముగారుచేసిన కర్తవ్య నిర్దేశము చదువఁబడి సంఘము వారు కడచిన జనెవరు 29 వ తేదిని తమసభయందుచేసినమూఁడవ నిర్ధారణమును మరల దృఢీకరించుచున్నారు. పైడా రామకృష్ణయ్యగారి నిధిని దొరతనమువారి పత్రములనుండి తీసి స్థిర ద్రవ్యముమీఁద పెట్టుట యుచితమని సంఘమువారు భావింపరు.)

లక్ష్మీనరసింహముగారు నీలపల్లిమీఁద నప్పిచ్చు ప్రయత్నము నందుమీఁద మానివేసిరిగాని 1890 వ సంవత్సరము ఫిబ్రవరి 5 వ తేదిని తద్ధనమును సభాపతి ప్రత్తి యంత్రములలో పెట్టుటనుగూర్చి మరల వ్రాసిరి. దానిపైని కార్యనిర్వాహక సంఘమువారు 1890 వ సంవత్సరము ఫిబ్రవరి 10 వ తేదిని జరగిన సభలో నిట్లు నిర్ధారణముచేసిరి. -

"1. Read Mr. A. L. Narasimham Garu's letter dated 5th feb. about investing P. R's fund of Rs. 10,000 in Mills &c., This committee in its resolutions dated 29th January and 10th June 1888 did not approve of the then proposal of Mr. A. L. Narasimham to invest Mr. Pida