పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

స్వీయ చరిత్రము.

పయిదానితోఁ బ్రకటింపఁబడిన రెండవదంభాచార్యవిలసనములోనుండి కూడరెండుభాగము లిందుఁబొందుపఱుఁబడుచున్నవి. -

"జంబు - ............మొన్న మీయింటిలో జరగినవివాహానికి బోగం వాళ్లకు యిరువైలూముప్ఫయిలూ వసూళ్లువెయ్యమని నిర్బంధపెట్టివేయించి, ఆసొమ్ములోపాయికారీని మీరుపుచ్చుకున్నారని కన్నెర్రగావున్నది గనుక బెంచిమేజస్ట్రీట్లు వాళ్లు నేరస్థులనిచెప్పరు.

దంభా - వసూళ్లువేయించినాను గాని నేను లంచాలుపుచ్చుకోలేదు. బంధువులయింటికి వెళుతూయేదోస్థలంచూస్తా ననిమిష పెట్టి తనకు వక సవారీ తనపెళ్లానికి వకసవారీ తనవెంటసహాయంగావచ్చే బంధువుడికి వకసవారిపెట్టి రానూ పోనూ వందేసిరూపాయలు ప్రయివేటుగా పుచ్చుకుంటూవున్న మునసపులను యేమిచేసినారు? వాళ్లుస్థలంచూడడమ నేవంకలు పెట్టి ప్యార్టీలవద్ద బోలెడేసిరూపాయలు రహస్యంగాపుచ్చుకుంటూవుంటే చూస్తూవూరుకున్నారుకాని నేనుబోగంవాళ్లకు వసూళ్లు వేయించినానని నామీదకక్షకడుతారా?"

దంభా - శాస్తుర్లుగారూ ! నామనస్సులో వక్కసంశయంబాధిస్తూ వున్నది. ఇంతాచేసినా ఆవైష్ణవులునన్ను ప్రాయశ్చిత్తము అనే పేరు లేకుండా తమలోచేర్చుకుంటారో లేదో!

జంబు - మాహారాజులాగుచేర్చుకుంటారు. రాఘవాచార్యులకు మన కచేరిలో పనివున్నదిగదా? అతనివ్యవహారం ఫరిష్కరించకుండా తొక్కి పెడుతూవుందురూ. తరువాత నేనుమాటాడుతాను.

దంభా - రాఘవాచార్యులు మహాచెడ్డవాఁడు. ముందు గాతనకార్యం చేయించుకుని తరువాత వైష్ణవులు కలిసి రాలేదని చెప్పేటట్టుగా వున్నాడు. మనంకార్యంచెయ్యకపోతే దొరకు అర్జీయిస్త్తేడేమో ! మనం ఆనెస్టుమ్యానులము కామనిదొరకు వక వేళ సందేహం కలుగవచ్చును.