పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

స్వీయ చరిత్రము.

ల్లదుగావున నేను వారినిందనమును సరకుఁగొన నందురేమో మీరు, పోనిండు. అట్టినిందనేనిం బొంది మీరు సాధించునర్థ మేమి ? వలదు. "దేశాభివృద్ధికై లేశమయినఁ బ్రాలుమాలక పాటుపడ నిచ్చఁగలవాఁడ" ననియున్నారుగాన దానివలన మఱేమియు సాధించునది లేకున్నను మనము చేయునదియేమో చేయక మనఁగూడదందురా? జనసామాన్యము సమాధానముం బొందియేకదా మీరు దేశాభివృద్ధికిఁ బాటుపడుట. అది లేకున్న నది పాటులోన గణనచేయఁ దగినదియే కాదు. మీ రిట్టివాదమునకుం బూనుకొనుటవలన నందఱకుఁ గాకున్నఁ గొందఱకేని యనిష్టమయియుండునని మున్నె విన్న వించితిఁగదా. అట్లు కొందఱచేనైనను నిందింపఁబడి ఫలసిద్ధిం బొందలేనికార్యమున కేల పూనవలయునో యెఱుంగ. అవధరింపుఁడు. కొన్నాళ్ళకుముందు చెన్న పురి నుండి యెల్లెడలకు జాబులువచ్చి విధవోద్వాహమున కనుకూలురగు వారెవ్వరో వారి నందఱినిఁజేర్చి యొక సమాజమువలె నేర్పడఁజేసినది మీ రెఱుఁగుదురుకదా? దానిలోఁ జేరినవారి నందఱంగాంచితిరా ? కొందఱినిమాత్రము విడిచిన మిగిలినయందఱును ధనికులును మహాధికారసము పేతులును నగుదురు. అట్టిసమాజ మేర్పడి దాదాపున రెండేండ్లగుచు వచ్చెఁగదా. ఏదీ యెందఱు బాలవిధవలు వారిచే వివాహితలైరి ? ఈ హిందువు లెట్టివారోకాని ఎట్టి నూతనాచారమునకును నెడమీయరు. కావున నిప్పటి మీవాదముజ్జగించుట సమంచిత కార్యమని యెన్ను చున్నాను. మంచిది. స్త్రీవిద్యయు నిట్టిదేకదా. ఆ స్త్రీ విద్యకు వ్యతిరిక్తముగ వాదించినను గొందఱు దూరెదరుగదా, అట్టి దానికేల నీవు పూనుకొనియుంటివని యనియెదరేమో నన్ను మీరు ? స్త్రీవిద్యకును విధవావివాహమునకును నెంతయంతరముండుటయు, అని రెండింటిని నే యేవిధమున జనసామాన్య మెన్నుటయు నెఱింగినమీకు విశేషము విన్న వింపలేను."

వ్యభిచారభ్రూణహత్యాదుల కవకాశము లేక బాలవితంతువులు తమ ద్వితీయ వల్లభులతో నిరంతరసౌఖ్య మనుభవించుచుండఁ గాఁ గన్నులపండువగాఁ గనుఁగొనఁ గలిగెడుభాగ్య మెప్పుడు లభించునా యని హృదయము