పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

133

భగవంతుఁ డొక్కఁడే. కానఁబ్రాచీనాచారదూషకులగు నవనాగరికులు మనకు జయ్యులు గాఁ దగుదురు. ఎందువల్లననఁగా వారు స్వోక్తియుక్తి ప్రమాణవాదులు. మనమో ప్రాచీనమహానుభావనివిష్టకార్యభారులము. కావున మన మన్యులచేతను జయ్యులమైనను, పరాజయము మనకేనాఁడును గలుగ నేరదు. ఒక వేళ మనకంటె విధవావివాహవాదులు బలవంతులైనను మనము భీష్మాను యాయుల మగుదుముగాక. మనప్రతిపక్షులు భార్గవప్రతిభు లగుదురుగాక. ధర్మమే జయము. చింతయేల ? మన మందఱము గూడుకొన్నఁ బ్రతివాదులు విత్తమత్తు లైనను మత్తగజంబులు శృంఖలాబద్ధంబులై కందికుందు చందంబున నగుట సిద్ధము. "శ్లొ. బహూనా మల్పసారాణాం సమవాయోదురత్యయః| తృణైర్విరచ్యతే రజ్జు ర్బధ్యంతే తేన దంతినః." అని యుండుట జగత్ప్రసిద్ధము గద. తమసదుత్తరము ప్రతిక్షణము ప్రతీక్ష్యమాణంబు."

ఈవిషయమున నటుతరువాత చెన్న పట్టణములో స ద్దడఁగినను, బందరులోఁ బ్రకటింపఁబడెడు పురుషార్థప్రదాయినీ పత్రికలో నెవ్వరో యప్పుడప్పుడు వ్రాయుచుండెడువారు. పురుషార్థప్రదాయినిలో సౌఖ్యార్థి యను నామముతో నెవ్వరో వితంతూద్వాహమునుగూర్చి వ్రాసినదానిని నేను వ్రాసినట్టు భ్రమపడి చిత్రనళీయాది బహునాటకకర్తలగు బ్రహ్మశ్రీ ధర్మవరపు రామకృష్ణమాచార్యులవారు యువనామ సంవత్సరములో బళ్లారినుండి నా కిట్లు వ్రాసిరి. -

"మఱియొకటి విన్న వించెద. డిసెంబరుమాసపు పురుషార్థప్రదాయినిలో నుండఁబోలు, "సౌఖ్యార్థి" యనుపేర విధవోద్వాహము సమంచిత కార్యమని వ్రాసినది మీరేయైయుందురని యూహించుచున్నాను. ఆవిధవోద్వాహము గుణవంత మెయైనను కాకున్నను, ఇప్పటికిని బహుజనులచే ననాదృతమైయున్నది. మీ రట్టిపని గుణవంతమని వాదింపఁ బూనుకొందురేని క్రియాసాధన మేమియు లేకున్నను కొందఱచే నేని నిందింపఁబడుట యొకటిప్రాప్తించు. జ్ఞానహీనులగువారు నిందించిన నేకొఱంతయు పాటి