పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము.

89

వున్నవి. ఎవరూ చదువుకోని పక్షమున తప్పుదస్తావేజు లేలాగుపుట్టునో బుద్ధిమంతుల కందఱకూ తెలుసును. కాఁబట్టి మేము యీవిషయములో విస్తరించి వ్రాయవలసినపనిలేదు. ఈవక్కదృష్టాంతమే పురుషులకు విద్యా కూడదనుటకు చాలినంతప్రబలయుక్తిగానున్నది. విద్య చదువుకోవడంవల్ల ప్రయోజనమేమి? పూర్వకాలపువారందఱూ విద్యచదువుకోక పోయినందుచేత చచ్చి పోయినారా ? చదువుకోకపోతే జీవనంజరగదా? కాలిమీఁద కాలువేసుకొని కలిగిన మాత్రంతో సుఖంగా కాలక్షేపం చెయ్యలేక, తీరికూర్చుండి విద్యపేరు పెట్టుకుని వృధాగా శ్రమపడడం యెందుకు? దొరతనంవారు మనగ్రామాలలో బళ్ళు పెట్టించి పిల్ల వాళ్ళను పాడుచేస్తూవుండగా దేశాభిమానంగల వారందఱూ చూస్తూ వూరుకోవడం న్యాయమా ? దొరతనంవారికి అందరూచేరి మాకు విద్యవద్దని మహజరు అర్జీలను పంపించుకోరాదా ? పెద్దలందఱూ సభచేరి, మనశిష్టాచారానికి విరోధంగా చదువుకొనేవారిని వెలివేస్తామని గట్టిగా కట్టుదిట్టములు యేర్పఱిచి విద్యమాన్పరాదా ? ఇంగ్లీషువారు చదువుకొని బాగుపడలేదా అంటారేమో, వారు తెల్లనివారు; మనము నల్లనివాళ్ళము. మనకు విద్యయెందుకు ? హిందువులందరూ చదువుకోవడంలేదా అంటే, వారికీ మనకూ చాలా భేదంవున్నది. వారు గ్రామాలలో వుండేవారు; మనము కొండలలో వుండేవాళ్ళము. కాఁబట్టి మనకు చదువుపనికిరాదు. పూర్వపువాళ్ళు యీమాత్రం యెరగకనే విద్యమానివేసినారా ? వారికంటె యిప్పటివాళ్ళు మహాబుద్ధిమంతులా ? ఇటువంటివిపరీతబుద్ధులు పుట్టుచున్నవిగనుకనే యీ కాలపువాళ్ళందరూ అల్పాయుష్మంతులుగా వుంటూవున్నారు."

నేను ధవళేశ్వరమును విడిచి వచ్చినతరువాత మరలఁ బనిలోఁ బ్రవేశింపవలెనన్న యుద్దేశము లేకపోయినను, 1876 వ సంవత్సరము నవంబరునెల మొదటితేదిని రాజమహేంద్రవరమునందలి రాజకీయశాస్త్రపాఠశాలలో నెల కిరువదియైదు రూపాయల జీతముగల యాంధ్ర ద్వితియోపాధ్యాయపదము నందుఁ గుదురవలసినవాఁడ నైతిని. మొట్టమొదట నా కీపనిని దయచేసెద