పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

స్వీయ చరిత్రము.

             "శ్లో. సింహవక్త్రం మహాకాయం, విఘ్నేశ్వరవరాధిపమ్
                 పశ్య సంజీవనీనాథం, మార్జాలయుగళాశ్రితమ్."

నాబ్రాహ్మవివాహ మీపత్రికయందే ప్రథమమున వెలువడ నారంభించెను. అట్టి వ్రాఁతకదియే తెలుఁగుభాషయందు మొద లగుటచేత నాదినముల యం దెక్కడఁ జూచినను మూఁకలు గట్టి జనులు హాస్యసంజీవనిని ముఖ్యముగా నందులో బ్రాహ్మవివాహమును జదివి యానందించుచు వచ్చిరి. రెండేండ్లకుఁ దరువాత నే నొకసారి బందరుపురమునకుఁ బోయినప్పు డొకబ్రాహ్మణ బాలిక బ్రాహ్మవివాహమును మొదటినుండి తుదవఱకును నప్పగించి నాకాశ్చర్యము కలిగించినది. తనరెండవయేట హాస్యవర్ధని యదృశ్యముకాఁగా మా హాస్యసంజీవనియు పుస్తకరూపమున నదృశ్యమై వివేకవర్ధనిలో నంతర్భాగముగాఁ బ్రవేశించి దురాచారదుర్నీ తిభంజనమునం దెంతో పనిచేసినది. ఈ యుపకారమునకు హేతుభూతులు శ్రీ పంతులవారేయైనందున నేను వారికిఁ గృతజ్ఞతా పూర్వకములైన యభినందనశతము లర్పించుచున్నాను. ఆంధ్రభాషాసంజీవనిలోని పూర్వాచార పోషకవ్యాసముల హేతుదౌర్బల్యమును ప్రకాశముచేయుట కనఁగా "స్త్రీలకు విద్యకూడదు" అను నిట్టివ్యాసము లాపత్రికయందు పొడచూపఁగానే తోడనే తత్ఖండనముగా నందలియుక్తులనే గైకొని "పురుషులకు విద్యకూడదు" అను నిట్టివ్యాసములను వ్రాసి మొదటి దాని యందలిహేత్వాభాసములను లోకమునకుఁ బ్రకాశముచేయుట కోదుభాషా సంజీవనియొక్కపనిగా నుండెను. స్త్రీలకు విద్యకూడదన్న దానికి ప్రతిగాఁ బ్రకటింపఁబడిన యొక చిన్న వ్యాసమును చూడుఁడు. -

"పురుషులకు విద్యకూడదు - మాపూర్వు లెప్పుడున్నూ విద్య చదువు కోలేదు. కాఁబట్టి విద్యాభ్యాసము పూర్వాచారవిరుద్ధము. పూర్వాచారవిరుద్ధమైన పని యెన్నటికిన్ని చెయ్యరాదు. యుక్తిచేత చూచినా, విద్యనేర్చుకోవడంవల్ల చాలనష్టాలు కనఁబడుతూవున్నవి. ఇప్పుడు కోర్టులలోపుట్టే తప్పు దస్తావేజులున్నూ దొంగపత్రములున్నూ చదువు మూలంగానేకదా పుట్టుతూ