కవికోకిల
జాషువా
కులం - మతం అనే సంకుచిత భావాలు పాముల్లా బూసగొట్టుతున్న కాలమది.
అంటరానితనం కరకరలాడుతున్న పాడుకాలమది.
వినుకొండ వీధిలో ఒక బాలుడు నడుస్తున్నాడు. అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడు ఆ వీధిన పోతూ, 'నన్ను తాకకు దూరంగా పో' అని ఈసడించుకున్నాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆ బాలుడు తన ఆవేదనను తల్లి ముందు తోడుకున్నాడు. తల్లి బాలుని కన్నీటిని తుడిచింది. తన కళ్లల్లో నీళ్లుబుకుతున్నా తమాయించుకొంది. అంటరానివారిగా పరిగణింపబడిన ఆ బాలుడే పెరిగి పెద్దవాడై నవయుగ కవిచక్రవర్తి అని కీర్తింపబడినాడు. అతడే కవికోకిల గుర్రం జాషువా.
జాషువా కవి 1895 అక్టోబర్ 28 న వినుకొండలో జన్నించారు. తండ్రి వీరయ్య క్రైస్తవ మతమును స్వీకరించిన యాదవుడు. తల్లి లింగమ్మ ఆది ఆంధ్ర కులమునకు చెందిన మహిళ, వారిది బీద కుటుంబము.
ఉన్నత పాఠశాల చదువు ముగించి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. 1915-16లో రాజమండ్రిలో, మూకీ చిత్రాల కథావాచకుడుగా పనిచేశారు. కొంతకాలం సత్యవోలు గున్నేశ్వరరావుగారి ' చింతామణి నాటక మండలి ' లో నాటకకర్తగా పనిచేశారు. 1919 నుండి 1929 వరకు గుంటూరులోని లూథరన్ చర్చి వారి ఉపాధ్యాయ శిక్షణా