Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మహామనీషి

రఘుపతి వెంకటరత్నం నాయుడు

బౌద్ధమతం బోధించిన దయాగుణం, క్రైస్తవ మతం బోధించిన సేవా పరాయణత్వం పుణికి పుచ్చుకొన్న మహనీయుడు ఆచార్య రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా వెలిగిన నాయుడుగారు 'బ్రహ్మర్షి'గా సుప్రసిద్ధులు.

నాయుడుగారు 1862 అక్టోబరు 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించారు. వారి తండ్రి రఘుపతి అప్పయ్య నాయుడుగారు, తాతగారైన వెంకటరత్నం గారు మద్రాసు సైన్యంలో అధికారులుగ పనిచేసినవారు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాలను గురించి పట్టించుకోరాదు అనే వారామె.

తండ్రి అప్పయ్య నాయుడు సుబేదారుగ పనిచేస్తూ చాలాకాలం ఉత్తర భారతంలో వుండేవారు. బాల్యం నుండి ఆ ప్రాంతంలో వున్నందున నాయుడుగారికి హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో చక్కని పరిచయం కల్గింది. తండ్రి అప్పయ్య నాయుడు గారికి హైదరాబాద్ బదిలీ కావటం వల్ల వెంకటరత్నంగారు చాదర్‌ఘాట్ లోని నిజాం ఉన్నత పాఠశాలలో చదువు సాగించారు. ఆ పాఠశాలలో సరోజిని నాయుడు తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ గారి వద్ద నాయుడుగారు శిష్యరికం చేశారు. మద్రాసు