పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' తివేణి ' సంపాదకులు డా. భావరాజు నరంసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా. టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, డా. గూడూరు నమశ్శివాయ మున్నగు పెద్దలు 15.1.1963న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తర్వాత ఆరు నెలలకే 4.7.1963వ తేదీన వెంకయ్యగారు దివంగతులయ్యారు.

కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ "నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ వున్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక" అన్నారు.

జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్యగారు.