పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుచినాపల్లి హైస్కూల్‌లో ఉపాధ్యాయుడుగా చేరిన చంద్రశేఖర్ అయ్యర్ స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించాడు. "పోలనుద్యోగికిని దూరభూమిలేదు" అన్న సూక్తి మేరకు స్వస్థలానికి దూరంగా ఉన్న విశాఖపట్నంలోని, మిసెస్ ఎ.వి.ఎన్. కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరారు. భౌతిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రాలలోనే గాక, వీణ, వాయులీన్ వాదనములలోను నైపుణ్యంగల వాడు చంద్రశేఖర్ అయ్యర్. సివి.రామన్ తల్లి పార్వతి అమ్మాళ్ తండ్రి గొప్ప సంస్కృత పండితుడు. సహనానికి, పట్టుదలకు మారుపేరు ఆమె.

విద్యార్ధి దశలో అనిబిసెంటుగారి అనర్గళమైన ఉపన్యాసాలు రామన్‌ను ఆకర్షించాయి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ చదువుతున్నపుడే 'హిందూ పురాణములు' అన్న వ్యాసం రాసి ప్రథమ బహుమతి నందుకొన్నాడు. నిరంతరం అధ్యయన శీలి రామన్. బి.ఏ లో ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉత్తీర్ణుడై, ఎల్‌ఫీన్‌స్టన్ బంగారు పతకంతో పాటు మరెన్నో విలువైన బహుమతులందుకున్నాడు.

పదార్థ విజ్ఞాన శాస్త్రంతో ఎం.ఏ తరగతిలో చేరాడు. తరగతిలో అధ్యాపకులు, విద్యార్ధులు రామన్ పట్ల అత్యంత గౌరవ భావంతో వ్యవహరించే వారు. ప్రయోగ శాల, గ్రంథాలయం అతనికి ఎల్లవేళలా అందుబాటులో వుండేవి. ధ్వనిశాస్త్ర విషయమున రామన్ ప్రయోగమారంభించాడు. ఇది వరకు ఎవరూ కనుగొనని లక్షణములను కనుగొన్నాడు. ప్రొఫెసర్ జోన్స్‌కు తన ప్రయోగ వివరములను నివేదించాడు. ఆ వివరములను పరిశీలించిన, ప్రొఫెసర్ రెలే రామన్ ప్రయోగాలను ప్రశంసించాడు. రామన్ తన పరిశోధనను వ్యాసరూపంగా సిద్ధపరచి ప్రొఫెసర్ గారికి పరిశీలించమని ఇచ్చాడు. ఆరు నెలలు దాటినా ప్రొఫెసర్ తన కాగితాలను యివ్వలేదు. శుద్ధ ప్రతిని వ్రాసి యిచ్చెదనని చెప్పి, తన వ్యాసాన్ని తీసుకుని, "ఫిలసాఫికల్ మ్యాగజైన్ ఆఫ్ లండన్" అను పత్రికకు 1906లో పంపాడు. ప్రొఫెసర్లు రామన్ ప్రతిభను గొప్పగా శ్లాఘించారు. 1907 లో రామన్ ఎం.ఏ (ఫిజిక్స్) పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయ చరిత్రలోనే ప్రప్రథమశ్రేణి విద్యార్ధిగా ఉత్తీర్ణుడయ్యాడు.

పెద్దలు, మిత్రులు రామన్‌ను ఇంగ్లండు వెళ్ళి పరిశోధన సాగించమని ప్రోత్సహించారు. కాని రామన్ శారీరకంగా దుర్బలుడైనందున ఇంగ్లండు వాతావరణం అతనికి అనుకూలించదని వైద్యులు చెప్పారు. రామన్ ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఉద్యోగార్థియై, చరిత్ర, అర్ధ శాస్త్రములు ప్రత్యేక విషయములుగా చదివి పోటీ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. "డెప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్"గా ఎన్నుకోబడినాడు. అప్పుడు రామన్ వయస్సు 18 ఏళ్ళు.

కలకత్తాలో ఉద్యోగమున చేరకముందే 'లోక సుందరీ'అను నామెతో అతని విహాహం జరిగింది. వారిది శాఖాంతర వివాహం. ఆ రోజులలో అది గొప్ప మార్పు. రామన్ కలకత్తాలో డెప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరాడు. కాని అతని