పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టభద్రులైనారు. విద్యార్ధి వేతనం లభించినందున, లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నారు. 1923లో మల్లాది సత్యలింగనాయకర్ ధర్మ సంస్థ సహాయంతో అమెరికా వెళ్ళారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలో లైబ్రేరియన్ గా చేరాడు. జీవరసాయన శాస్త్రంలో అభిరుచి పెరగడంతో డాక్టర్ ఓటోపోలిన్ అను ఆచార్యుని నేతృత్వంలో పరిశోధన సాగించి పి.హెచ్.డి. పట్టా పొందారు. విరామము దొరికనప్పుడల్లా వైద్యశాలలో ఆర్డర్లీగా పనిచేస్తూ, తన చదువుకు కావలసిన పైకం సంపాదించుకొనేవారు.

తన తమ్ముని బలిగోన్న 'స్ప్రూ' వ్యాధిని నిర్మూలించుటకు తగిన మందులను సాధించుటకు కంకణం కట్టుకున్నారు. సుబ్బారావుగారి అవిశ్రాంత పరిశోధనాసక్తిని గమనించిన సియానమిడ్ వైద్య పరిశోధనా సంస్థ వారాయన తమ లెడర్లీ సంస్థలో పరిశోధకుడుగా ఎన్నుకొన్నారు. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుకొన్నారు సుబ్బారావుగారు. 1945 జూలై 20వ తేదీన ఫోలికి ఆమ్లం నుండి బంగారు వన్నె భస్మాన్ని కనుగొన్నారు. ఆపోడి స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది.

పాతికేళ్ళపాటు ఆకలి, నిద్ర, అలసటలను విస్మరించి సాగించిన కృషి ఫలితంతో సుబ్బారావుగారెంతో సంతోషించారు. తమ్ముని ప్రాణాలను బలిగొన్న వ్యాధిని ప్రపంచం నుండి పారద్రోలగలగినానన్న తృప్తి కలిగిందాయనకు. ప్రపంచమందలి రక్త విజ్ఞాన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యులుగా మన్ననలందుకున్నారు. లెడర్లీ సంస్థ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. ఒక భారతీయునికి, ఆ కాలంలో అంత గొప్ప పదవి లభించడం అపూర్వం!

భారతదేశం వచ్చి తన ప్రజలకు సేవ చేయాలనే కోరిక కల్గింది. కలకత్తాలోని 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజిన్ అండ్ పబ్లిక్ హెల్త్' అనే సంస్థకు ఆచార్యునిగా వెళ్ళడానికి ఫోర్డు ధర్మ సంస్థ నిధి సుబ్బారావుగారిని ప్రోత్సహించింది. కాని ఆ సంస్థ నిర్వాహకులైన ఆంగ్లేయులు భారతీయుడన్న ఒకే ఒక కారణంతో సుబ్బారావు గారికి ఆ పదవినివ్వ నిరాకరించారు.

సుబ్బారావుగారు క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల గొప్ప మందులను కనుగొన్నారు.

విద్యార్ధుల పట్ల సుబ్బారావుగారికెంతో ప్రేమ. ఎందరో విద్యార్ధులకు ఆర్థిక సాయమందించారు.

ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా పరిశోధనలు సాగించిన సుబ్బారావుగారి ఆరోగ్యం దెబ్బతింది. 36 గంటలపాటు నిద్రాహారాలు లేక పరిశోధనలో నిమగ్నులయ్యేవారు.

ఆయనలోని మానవుడు, పరిశోధకునికంటే గొప్పవాడై వెలిగాడు. తనతో పాటు