Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
వైద్యరంగంలో ధృవతార

యల్లాప్రగడ సుబ్బారావు

తమ్ముడు పదిరోజులుగా బాధపడుతున్నాడు. రక్తహీనత వల్ల నానాటికీ కృషిస్తున్నాడు. పలుమార్లు విరేచనాలవుతున్నాయి. వ్యాధి మరింత తీవ్రమైంది. తమ్ముని బాధను చూస్తూ నిస్సహాయుడై నిల్చున్నాడు అన్న. పెద్ద వైద్యం చేయించేందుకు డబ్బుల్లేని వాడా బాలుని తండ్రి. చూస్తున్నట్లే తమ్ముడు శాశ్వతంగా కన్నుమూశాడు. పన్నెండేళ్ళ అన్న కన్నీరు కారుస్తూ 'ఈ రోగానికి మందే లేదా?' అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.

భయంకరమైన ఈ వ్యాధిని నిర్మూలించాలి. ఇందుకు మందు కనిపెట్టాలి. నేను డాక్టర్ కావాలి అని నిశ్చయించుకొన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడే దీక్ష, నిరంతర శ్రమ, పరిశోధనల వల్ల గొప్ప వైద్యశాస్త్రవేత్తగా ప్రపంచ ప్రజల మన్ననలందుకున్న డా. యల్లాప్రగడ సుబ్బారావు.

యల్లాప్రగడ సుబ్బారావుగారు 1.7.1896న రాజమహేంద్రవరంలో జన్మించారు. తండ్రి తాలూకా కచ్చేరిలో గుమాస్తా. వారిది బీద కుటుంబం. అందుకుతోడు బాల్యంలోనే తండ్రిని కోల్పోయారు సుబ్బారావుగారు. బాల్యం నుండి దైవచింతన కలవాడాయన. రామకృష్ణమఠం వారి సహకారంతో మద్రాసు మెడికల్ కాలేజి నుండి