Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
బహుముఖ ప్రజ్ఞానిధి

సురవరం ప్రతాపరెడ్డి

" ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ "
                             - దాశరథి

కనీసమైన మానవ హక్కులు లేక, నవాబు, నిరంకుశత్వంలో అలమటిస్తున్న తెలంగాణా ప్రజానీకాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దిన తెలంగాణ వైతాళికులు ముగ్గురు మనకు సదాస్మరణీయులు.

వారు కొమర్రాజు లక్ష్మణరావుగారు, మాడపాటి హనుమంతరావుగారు, సురవరం ప్రతాపరెడ్డిగారు. చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు వారికి ముఖ్యంగా తెలంగాణాకు వెలుగును పంచిన మహనీయులలో ఎన్నదగినవారు సురవరం ప్రతాపరెడ్డిగారు.

ప్రతాపరెడ్డిగారు 1896 మే 28 తేదీన గద్వాల సంస్థానంలోని ' బోరవెల్లి' అను గ్రామంలో తమ అమ్మమ్మగారి ఇంట్లో జన్మించారు. వారి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా అలంపురం తాలూకాలోని ' ఇటికలపాడు '. తల్లి రంగమ్మ. తండ్రి నారాయణ రెడ్డిగారు. దాతగా విద్యాభిమానిగా పేరుగాంచిన పిన తండ్రి రామకృష్ణారెడ్డిగారి