పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉరి తీస్తారని ప్రభుత్వం వూరూరా చాటింపు వేయించింది. కాక్రేన్ ఎదుట ఉరి తీశారు.

ఆ విషాద దృశ్యాన్ని 2 వేల మంది ప్రజలు కన్నీళ్ళు రాలుస్తూ చూచారు. వారికి నోళ్ళకు బీగాలు పడ్డాయి. నరసింహారెడ్డి ప్రాణం ఉరికంబం మీద అనంతవాయువుల్లో కలిసేవరకు అతని ముఖం ప్రశాంత గంభీరంగా వుండినది.

చుట్టుప్రక్కల వారికి హెచ్చరికగా వుండాలంటూ నరసింహారెడ్డి శిరస్సును రెండు మూడు తరాల వరకు ఆ బురుజుపై వేలాడేటట్లు చేశారు ఆనాటి కిరాతకులైన తెల్లదొరలు. నరసింహారెడ్డి వంటి త్యాగమూర్తుల బలిదాన ఫలం యీనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం.

జానపదులు ఆ స్వాతంత్ర్య వీరుని అమరగాధను పాడుతూ మనలను ఉత్తేజపరుస్తున్నారీనాటికీ.

"దొరవారి నరసింహారెడ్డి
నీ దొర తనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి
రేనాటిసీమలో రెడ్డోళ్ళ కులములోనా
దొరవారి వమిశానా ధీరుడే నరసింహారెడ్డి
కోయిల కుంట్లా గుట్టలెంటా కుందేరు వొడ్డులెంటా
గుర్రమెక్కి నీవు వస్తే కుంపిణికి గుండెదిగులూ
కాలికి సంకెళ్ళు వేసి చేతికి బేడీలు వేసి
పారాతో పట్టి తెచ్చి బంధికానులో పెట్టిరీ
కండ్లకు గంతలూ గట్టి నోటి నిండా బట్లు పెట్టి
నిలువునా నీ తల్లికేమో చావు సుద్దీ తెలిపినాదీ
కన్నకడుపే తల్లటించే గంగలోనా గంగ గలిసే
దొరవారి నరసింహారెడ్డి
నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి"