పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రులకు గర్వకారణమైన

'ఆంధ్రకేసరి' ప్రకాశం పంతులు

'దేశనాయకశిఖామణియై
తెలుగుజాతి ప్రకాశమ్మె
అవతరించిన ఆంధ్రకేసరి
అమరుడైన పురారి అతడు'

ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంఠిత ధైర్యసాహసాలకు, అసమానత్యాగనిరతికి ప్రతినిధి ప్రకాశం పంతులు.అన్యాయాన్ని అక్రమాన్ని ఎదుర్కొనుటలో అతనికతడే సాటి. అతనివల్ల సహాయమందుకున్న వారే అతనికి ద్రోహం చేశారు. జాతీయ నాయకులు అతనిని సరిగాగౌరవించలేకపోయారు. ఎవరెన్ని విధాల వంచించినా ప్రజలను నమ్మి తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి ప్రకాశం. ప్రజలే ప్రకాశం ప్రకాశమే ప్రజలు అన్నమాటలో అతిశయోక్తి లేదు. ప్రకాశం తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. వీరి సంతానంగా 23.8.1872న ప్రకాశం గారి జననం. వల్లూరులో ప్రకాశం గారి ప్రాథమిక విద్య సాగింది. అ, ఆలు దిద్దుకుంటున్న వయసులోనే అల్లరితనానికి పేరు పొందాడు. గుండ్లకమ్మ ఈత,సాముగరిడీలు, రౌడీల సహవాసం తాలింఖానాలో వ్యాయామం మున్నగువాటిలో దిట్ట అయ్యాడు.