Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామమూర్తి గారి శిష్యుల నుండి సేకరించిన వివరాలను బట్టి, రామమూర్తిగారు కోడిమాంసం సేవించేవారని తెలుస్తుంది.

భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు.

కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.

చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు.

తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ " సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి " అన్నారు.