Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హంటర్ బిళ్ళలు తీసివేస్తే కాని క్లాసులకు రానివ్వనని విద్యార్థులకు ఆదేశాలు పంపారు. అందుకు విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థి నాయకుడైన శ్రీ సర్వోత్తమరావును కాలేజీ నుండి డిస్మిస్ చేశాడు ప్రిన్సిపల్. ఆయన కెక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. రావుగారి జీవితంలో ఇదో పెద్ద మలుపు.

స్వరాజ్య పత్రిక

జాతీయోద్యమ ప్రచారానికి పత్రికలు ప్రధాన సాధనాలని విశ్వసించి శ్రీరావు 1908లో శ్రీ బోడి నారాయణరావు (ప్రచురణ కర్త) సహకారంతో "స్వరాజ్య" తెలుగు వారపత్రికను ప్రారంభించారు. తెల్లదొరల అక్రమ, అన్యాయ చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ రావుగారు వ్యాసాలు వ్రాసేవారు.

కారాగార శిక్ష

1908లో తిరునల్వేలిలో ఆష్ అనే ఆంగ్లేయ అధికారిని విప్లవ కారులు కాల్చి చంపారు. ప్రజోద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రావుగారు 'విపరీతబుద్ధి' అన్న శీర్షికతో సంపాదకీయం వ్రాస్తూ అధికారుల దమన కాండను తీవ్రంగా ఖండించారు. రావుగారికి, రాజద్రోహ నేరంపై మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది ప్రభుత్వం. నాటి జైలు జీవితానుభవాలను శ్రీ దర్శి చెంచయ్య "నేనూ - నా దేశం"అన్న గ్రంథంలో ఇలా చిత్రించారు.

"ఎం.ఏ పట్టభద్రులైన శ్రీ సర్వోత్తమరావును వెల్లూరు సెంట్రల్ జైలులో బంధిపోటు దొంగలు, హంతకులున్న గదిలో వేశారు. మానరక్షణకు రెండు గోచిలిచ్చారు. మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు, పడుకునేందుకు చిన్న ఈత చాప, అన్నం తినడానికి మట్టి చట్టి, నీళ్లు త్రాగడానికి మట్టిముంత, మల మూత్ర విసర్జనకు మరొక మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావాటి కడియం, మెడకు మరో కడియం వేసి ఒక కొయ్యముక్కను వీటిలో దూర్చారు. మొలత్రాడు, జందెం తీసివేశారు. తల బోడి చేయించారు... రాగి సంకటి ముద్ద, దానిలో రాళ్లు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి. ఈ తిండిలో మూడేళ్లు జీవించారు. గవర్నర్ జైలుని చూచుటకు వచ్చినప్పుడు, తనను మానవమాత్రునిగా చూడమని కోరగా, ఆ దుర్మార్గుడు రావుగారిని దుర్భాషలాడి వెళ్లిపోయాడు." ఈ విధంగా అష్టకష్టాలను స్థిర చిత్తంతో ఎదుర్కొన్న స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ గాడిచర్ల.

1914లో తిలక్, అనీబిసెంట్ గార్లు స్థాపించిన 'హోమ్ రూల్ లీగ్' ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా వుండి, రాష్ట్రమంతటా పర్యటించి తమ అనర్గళ ప్రసంగాలతో ప్రజలను వుత్తేజితుల గావించారు.

స్వరాజ్య పార్టీలో చేరిక

1923లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ గార్లు నెలకొల్పిన స్వరాజ్య