పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్న కూఁతురు దొరకినది కాబట్టి దేవతావాక్యప్రకారము రాజుయొక్క వంశము భూమిమీద నిలిచినదన్న సంతోషమును, భర్తపోయినాడన్న దు:ఖమును, మిత్రవిందను గొంతతడవు నిశ్చేష్టురాలినిగా జేసెను. ప్రమతి తనకొమార్తెయే యయిన సంగతి తెలిసినతోడనే తనబిడ్డను చూచుకొనుటకు దల్లికి ఋణములేకపోయెగదాయన దు:ఖించి, యేమో చెప్పదలచుకొని "నీతల్లి నీతల్లి--" అనుమాటలు దక్క మఱియేమియుఁ బలుక లేక కొంతతడవు నివ్వెఱగొంది యుండెను.

రాజా ప్రకారము సంతోషములోను, దు:ఖములోను మునిగియుండగా మిత్రవింద సమీపమునకు వచ్చి సుప్రసిద్ధుడగు నొక శిల్పకాఱునిచే క్రొత్తగాచేయించిన మంజువాణి యొక్క విగ్రహ మొకటి తనయింట నున్నదనియు, దానిపని యేలినవారు మాగృహమునకు వచ్చి చిత్తగింతురేని నిజముగా మంజువాణియే యక్కడ నున్నదనుకొనునంత విచిత్రముగా నున్నదనియు రాజుతో మనవిచేసెను. రాజు తనభార్యయొక్క రూపమును జూడవలెనని యత్యాసక్తుడయి యున్నందునను, ప్రమతి తా నెప్పుడును జూచియెఱుగని తల్లి యాకార మేప్రకారముగా నుండునో కనవలెనని యతి కుతూహలయయి యున్నందునను, అందఱును గలిసి యక్కడకు వెళ్ళిరి. ఆ వింతయైన విగ్రహమున కడ్డముగానున్న తెరనుదీసి మిత్రవింద చూపగానే, అచ్చముగా విగ్రహము మంజువాణిని బోలియున్నందున రాజు