పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మున్నది" అని పలికెను. ఆ చిన్న దానిని రా జంత శ్రద్ధతో జూచుటయు తనకూతుఁ రెప్పుడో చిన్న తనములో దనయాజ్ఞ చేతనే యడవులలో విడిచిపెట్టబడిన దని చెప్పుటయు విచారించి యాగొల్లవాఁడు చిన్న దానిని విడిచిపెట్టిరన్న గాలమున విధమును, ఆమె గొప్పవంశమందు బుట్టినదౌటకు సాక్ష్యమిచ్చు తనకుదొరకిన యమూల్య వస్త్రాభరణములను దలఁచుకొని మనసులో బరిపరివిధముల జింతింపసాగెను. ఆసంగతు లన్నిటిని బాగుగ విమర్శించి వాఁడు రాజు పోయినదనుకొన్నుచున్న కూతురే యీ ప్రమతియని నిశ్చయము చేసికొనెను.

అప్పుడు రామవర్మయు, ప్రమతియు, బహుమానుఁడును, మిత్రవిందయు, అందఱును గూరుచుండియుండగా ఆ ముసలి గొల్లవాడు తనకు ప్రమతిదొరకిన విధమును, ఆమెనుగొని వచ్చి విడిచినమనుష్యుని పెద్దపులిపట్టుకొనగా దాను జూచుటయు జెప్పి, ఆసమయమున బ్రమతికి గట్టబడిన విలువవస్త్రమును మెడయందున్న కంఠాభరణమును బట్టకుగట్టియున్న కాగితమును గొనివచ్చి రాజుముందఱ బెట్టెను. వానిని జూచిన తోడనే మిత్రవింద యావస్త్రమును నగయు మంజువాణి తన కూతున కలంకరించినవే యనియు, ఆ కాగితముమీఁదవ్రాత తన మగనియక్షరములే యనియు, ఆనవాలుపట్టెను. అప్పు డక్కడనున్న వారి కందఱికిని సందేహము నివర్తియయి, ఆమె సుమిత్రుని పుత్రికయౌట విస్పష్టమాయెను. పోయినదనుకొను