పుట:Sukavi-Manoranjanamu.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్యానాథుడుగారు గల్ల కటి శబ్దములు గ్రామ్యములన్నారు. ధర్మాభట్టు గారు గల్ల శబ్దము మాత్రమే గ్రామ్యమన్నారు. కటి శబ్దము మహాకవు లందరును వాడుక చేసినారు.560

కాళిదాస దండకము

'చారు శింజక్కటీసూత్ర నిర్భర్త్సితానంగలీలా
ధనశ్శింజనీడంబరే, దివ్యపీతాంబరే....

561
ఆముక్తమాల్యద (1-56)
మ.

శయపూజాంబుజముల్ ఘటిం దడబడన్ జన్దోయి లేఁగౌను పై
దయదప్పం బసపాడి పాగడపుపాదంబొప్ప జెంగల్వ డి
గ్గియ నీ రచ్యుతమజ్జనార్ధము గటిం గిలించి దివ్యప్రబం
ధయుతాస్యల్ ద్రవిడాంగనల్ నడతు రుద్యానంపు లోఁద్రోవలన్.

562

ఇటువలెనే మహాకవి ప్రయోగములు బహులములు గలవు. సరసమైన కటి పదమును గ్రామ్యమనరాదు.583

ధర్మాభట్టుగారు అశ్లీలమునకు పదగతదోషములందు 'గుహ్యకేశ' పదమును, అర్థగతదోషములందు 'మదనధ్వజ' పదమును వ్రాసినారు. యుక్తముగా నున్నది. 'గుహ్యక' పదము, 'ఈశ' పదము- రెండు కలిపితే 'గుహ్యకేశ' అని వ్రీడాకరమైన అశ్లీలము. 'గుహ్యకేశ్వరః' 'యక్షేశః' అని ఉంటే, పదగతదోషము లేదు. 'మదన' పదము మంచిదే. 'ధ్వజ' పదమును మంచిదే. 'మదనధ్వజ' మని రెండు కలిపితే వ్రీడాకరమైన అశ్లీలము. మత్స్యము కర్థముండినా, చటుకున వ్రీడాకరమగు నర్థమే స్పురించును. 'గుహ్యకేశః' కుబేరున కర్థముండినా, వ్రీడాకరమగు నర్థమే చటుకున స్ఫురించును. గాన ధర్మాభట్టుగారి నిర్ణయము యుక్తముగా నున్నది.564

విద్యానాథుడుగారు అశ్లీలమును మూడు విధములుగా చెప్పినారు. 'అమంగల, జుగుప్సా, వ్రీడాకం త్రివిధ మళ్లీలం' అని. ఉదాహరణము, వివరణ ఇట్లున్నది.