పుట:Sukavi-Manoranjanamu.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుత్తమలోకము లెటుల గలుగును (కావున ఇది అతిమాత్రము. ఎటువంటి దుశ్చరితుడైనను కవీశ్వరులచేత వర్ణించబడేనా, వానికి నుత్తమలోకము సిద్ధము.

'కీర్తిం స్వర్గఫలా మాహుః, ఆసంసారం విపశ్చితః
అకీర్తిం తు నిరాలోక, నరకోద్దేశ దూతికామ్'.

ఎవ్వని కీర్తి ఎంత మట్టుకుంటున్నదో వానికి నంత మట్టుకు స్వర్గప్రాప్తి. ఎవ్వనికి ఎంతమట్టుకు నపకీర్తి ఉంటున్నదో వానికి నంతమట్టుకు నంధకారబంధురమైన నరకప్రాప్తి.

‘మహానదీ ప్రవిష్టాని, రథ్యాంబూ నీవ పావనాః
కావ్యే ష్వంకిత నామాన, స్సేవ్యంతే మానవా వరైః'

అని యున్నందున కవీశ్వరులచే వర్ణింపబడిన వారికి సద్గతి కల్గునని యుండగా, రాజులను వర్ణించిన కవీశ్వరులకు సద్గతి యనుట అతిమాత్ర మెందుకు కాకపోయెను ఇతర కవీశ్వరులు మాత్రమే కాదు, విద్యానాథుడుగారును అతిమాత్ర దోషమునకు పాల్పడిన వారే.554

ప్రతాపరుద్రీయము

"బ్రహ్మన్ మేరుగిరౌ కృతేపి కిమిదం నైవం విధాస్తే ముదః
స్వామిన్ సత్య మధిక్రియాద్య ఫలితా యద్వీరరుద్రః కృతః
మిథ్యా కిన్ను వికత్థసే త్రిజగతస్త్రాణాయ మత్ప్రార్థితః
శంభుః క్ష్మా మనతీర్ణవానితి కథా జాతా హరి బ్రహ్మణోః."

555

ఇచ్చట నతిమాత్ర మెందుకు కాకపోయెనో తెలియదు.556

"స్వామిన్ గోత్ర మహీధరాన్ కిమధునా నిచై ర్విధత్సే కుతో
గాధానంబునిధీన్ కురోషి కురుషే కిం దిక్పతీ నల్పకాన్
ఇత్థం పార్శ్వచరానులాప మఖిలం న్యక్కృత్య ధర్మైషిణా
స్పష్టః పద్మభువా గుణైక వసతిః శ్రీవీరరుద్రో నృపః"

557


“వదాన్యో నాన్యోస్తి త్రిజగతి సమో రుద్ర నృపతేః
గుణశ్రేణీ శ్లాఘా పిహిత హరిదీశాన యశసః
సమాంతా దుధ్భూతైర్ద్విరద మదగంధై స్సురభయః
క్రియంతే యద్విద్వజ్జనమణిగృహ ప్రాంగణ భువః." (నాయక.16)

558

ఇంతకన్న నతిమాత్రము కన్పించదు.559