పుట:Sukavi-Manoranjanamu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జెలువొప్ప న్వెలయింపఁజాలు భళిరే శ్రీరంగరాయక్షమా
లలనావల్లభుఁ డుర్వీదాతలకు నెల్లన్ దాత యూహింపఁగన్.

549

(అనుచోట్ల దోషము కావలెను. కాని, ఇటువలెనే మహాకవులందఱు నతిమాత్రమునే వర్ణించినారు. అవి యెన్నని వ్రాయము!550

వసుచరిత్రము (1-83) నందే
మ.

అతిధీరుం డతిదానశీలుఁ డతిరమ్యాకారుఁ డత్యంతసు
వ్రతుఁ డంచున్ దను సన్నుతించు కవి వాగ్వ్యాపారమెల్లన్ యథా
ర్థతరంబై విలసిల్ల తిర్మల మహారాయేంద్రు శ్రీ వేంకట
క్షితినాథోత్తముఁ డిందు నందు గతి గల్గించున్ గవి శ్రేణికిన్.

551

అన్ని పుస్తములందు (చతుర్థచరణమందు) 'కల్పించున్' ఆవి యున్నది. వ్యాఖ్యాకారులును యతిభంగము కానక తప్పునకే అర్థము వ్రాసినారు. 'కల్పించె' ననగా ఉత్తదనుటే, గాన నర్థమున్ను బాగులేదు. ధనకనకవస్తువాహనాదులచే గతి కల్గించినాడనిన్ని, ఉత్త మపురుషగుణస్తుతిచే నందు పరము గల్పించినాడనిన్ని అర్థము. ఇచ్చట నతిమాత్రమే కాకపోతే—552

స్వర్గారోహణపర్వము (1-98) నందు
క.

విను మొక్కటి సెప్పెద రా
జను వానికినెల్లఁ దప్ప దవనీశ్వర యె
ట్లును నారకస్థలంబుం
గనుగొనవలయు టిది వేదకథితము సుమ్మీ.

553

అని ధర్మరాజుతో నింద్రుడు చెప్పెనుగదా! మరియును—

‘అసత్కీర్తనకాంతార, పరివర్తన పాంసులామ్
వాచం శౌరికథాలాప, గంగయైన పునీమహే!

అని వేదవ్యాసులవారు రాజులను వర్ణించుట చేతను వాక్యము పాంసులమైనది. శ్రీ భగవత్కథాగంగ చేత పవిత్రమును చేయుచున్నామని హరివంశము రచించినారని స్పష్టముగా నుండగా వెంకటేంద్రుని వర్ణించిన కవీశ్వరులకు