పుట:Sukavi-Manoranjanamu.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాజి ఈ విషయమున వ్రాసినది ముందే వ్రాసినాము.) ఛందోభంగమును దోష మన్నారు. ధర్మాభట్టుగారి తాత్పర్యము గోచరించదు. (పై పద్యమును) అచలధృతియను వృత్తమని చెప్పితే మంచిదగును.507

'ద్విగుణిత వసులఘు రచల ధృతి రిహ తు'

అని అచలధృతి లక్షణమున్నది. పదారు లఘువులు పాదమునకు "సర్వతో లఘు 'వని చెప్పవచ్చును. అటువంటి జగదేక పండిత సార్వభౌములకు నిటువంటి పొరపాటులు. ఏమనుకోము!508

యత్సౌందర్యమవేక్ష్య జీర్ణమునయో వాతాంబు పర్ణాశనాః
ధైర్యం నార్య ఇవాపసార్య సహసా సంత్యజ్య లజ్జామపి
సంభోగం కీల వపు రిత్యభిదధే పౌరాణికై స్తత్క్వవా
రామస్య క్వ ను కామరూపవిభవ స్త్రీమాత్ర వేత్రప్రదః

509

ద్వితీయ పాదాంతము లఘువు. గురువు కావలెను. కాకపోతే ఛందోభంగము. అయితే ఆలంకారికులు నిర్ణయంచిన ఛందోభంగము.510

'రామాస్త్రేణ హతం ద్విషత్కరిశిరో భోగీంద్ర భోగా ఇవ' ఇచ్చట ఛందోభంగమని వ్రాసినారు. (పై పద్యమున ద్వితీయ పాదాంతమున) 'అసి' అనుచోట ఛందోభంగమెందుకు కారాదో తెలియదు. రెండును శార్దూల వృత్తములే. ఒకచోట ఛందోభంగమేమి? ఒకచోట కాకపోవటమేమి? ఇది ఏమనుకోము!511

'నిర్ముక్తం రుధిరాప్లవేన ఘనమాణిక్యత్త్విషే వారుణమ్'.

'మాణిక్యేత్యత్ర యతి భంగః' అన్నారు. పదమధ్య పదావసానములని వారి తాత్పర్యము. 'మాణిక్య' పదము మూడక్షరములు. అందులో రెండవ యక్షరము యతి. అటుల నుండరాదు. పదాది వర్ణమే ఉండవలెనని ఆలంకారికుల తాత్పర్యము. అయితే వారును (ఇట్లుండుట) దోషమనుటేకాని (ప్రయోగించుట) మానలేదు.512

‘జిత్వా రామావధాని ప్రవరమురు మరుద్వేగవద్వేద చర్చా
గోష్ఠ్యా నారాయణార్యస్సదసి బుధశతై శ్లాఘ్యమానావధానః
సంతుష్టా ధర్మభూపాదలభత శిబికాం చామరచ్ఛత్ర పూర్వం
గర్వాఖర్వావధానీశ్వర శరభఘటా గండభేరుండ చిహ్నమ్'

513