పుట:Sukavi-Manoranjanamu.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అస్యార్థః. సంస్కృతాపభ్రంశ మాగధ శౌరసేన లక్షణాసు భాషాసు రేఫేణ హకారేణ వా యుక్తేక్షరే పరే పూర్వస్య పాదాంతస్య వర్ణస్య లఘుతా వికల్పేన ఇష్టా. రేఫ సంయుక్తే సతి— 'కథం భ్రమరగ్రామే వసతి–హసతి ప్రాజ్ఞా' ఇత్యుదాహరణమ్. హకార సంయుక్తే సతి— 'భవతి హ్రస విష హ్రస్వస్త్యజతి హ్రియ' మితి.

'తరుణం సర్షప కాకం
నవోదనం పిచ్చిలాని చ దధీని
అల్ప వ్యయేన సుందరి
గ్రామ్యజనో మృష్ట మశ్నాతి'

తరుణమితి, ఆర్యావృత్త మేతత్. మృష్టం నామ మధురం. అత్ర ద్వితీయ చతుర్థ పాదాంతయోః వర్ణయోర్గురుత్వమ్. తృతీయ పాదాంతస్య సుందరీతి పదాంతస్య ఇకారస్య ఉపరిస్థిత గకార రేఫ సంయోగాత్ లఘుత్వం దర్శిత మితి జ్ఞేయమ్.'

అనియున్నది. పూర్వార్థమందు చివరనున్న 'ని' వర్ణము; ఉత్తరార్థమందు చివరనున్న 'తి' వర్ణము (పాదాంత మందలి లఘువులగుటచే వికల్పముగా గురువులు ) తృతీయ పాదాంతమందున్న 'రి' (రేఫ) సంయుక్తమున కివతలనుండుట వలన గురువైనను లఘువు. ఇది లాక్షణిక సిద్ధాంతము. వాస్తవ మిటువలె నుండగా ‘సాహిత్యరత్నాకరము'న శబ్దాలంకారతరంగ మందు ధర్మాభట్టుగారు—

ఏకాచ్కం సర్వతో లఘు, నిరోష్ఠ్యం చ. యథా—

‘అను హరణ చరణ రణ చణ
దళగల గలగహనదహన సరలశర
రల నతరత నయజయ
జయదశరథతనయ జలజదళనయన'

అని వ్రాసినారు. ద్వితీయ చతుర్థ పాదాంత లఘువులైన ర, న— ఈ రెండక్షరములు ఆర్యావృత్తమునకు గురువులు కావలెను. గురువులు కాకపోతే ఛందోభంగము, గురువులైతే సర్వలఘునిర్ణయము పోవును. ఇంతేకాదు; ఆలంకారికులు పాదాంతలఘువును గురువుగా నంగీకరించలేదు. (కుమారస్వామి సోమ