| కాలిందీ జల జనిత శ్రియశ్శ్రయంతే | 502 |
ఇదియు ప్రహర్షిణి. ఇందొక పాదాంతలఘువు.503
ఇటువలెనే వసంతతిలకా, ప్రహర్షిణీ వృత్తము లందును పాదాంతలఘువులు గురువులుగా బహులములు గలవు. వ్యాఖ్యాకారు లీప్రయోగము లన్నిటికి నేమి సమాధానము చేసికొనిరో తెలియదు. సమస్తవృత్తము లందును పాదాంతలఘువులు కావలసిననప్పుడు గురువు లగుట నిస్సందేహము. దోషముకానిదానిని దోషమనుట యొకదోషము. తాము దోషమనిన్ని, పాదాంతలఘువులు గురువులుగా ప్రయోగించుట రెండవ దోషము. ఆలంకారికుల తాత్పర్యము తెలియదు. వ్యాఖ్యాకారుల సిద్ధాంతము పరిశీలించక చేసినదని వేరే చెప్పనేల!504
| 'వింధ్యారణ్య కృతకుటుంబ రక్షణస్య' | |
అని లక్ష్యము చెప్పిరి. క్రమభ్రష్ట మనెడు దోషము తాము చెప్పినదే, ఇచ్చట సంభవించెను.505
పాదాంతలఘువు కావలసినపుడు గురువెటులగునో రేఫసంయోగమున కివతల నుండెడు వర్ణము (లఘువు) కావలసినపుడు లఘువగును.506
| పాదాదా విహ వర్ణస్య సంయోగః క్రమ సంజ్ఞికః. | |
| సర్వాస్వపి చ భాషాసు, రహ యుక్తాక్షరే పరే | |