పుట:Sukavi-Manoranjanamu.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొన్ని పదవాక్యార్థ దోషముల విచారణ

ప్రతాప రుద్రీయ మందు వాక్యదోషములు ఇరువది నాలుగు చెప్పినారు. వాటిలో భగ్నచ్ఛందము యతిభ్రష్ట మనునవి యున్నవి.

'ఛందోభంగం వచో యత్ర, తద్భగ్న చ్ఛంద ఉచ్యతే
యత్ర స్థానే యతిభ్రంశ, స్తద్యతిభ్రష్ట ముచ్యతే'

అని లక్షణము (దోష. 35) చెప్పి—

వింధ్యారణ్య కృత కుటుంబ రక్షణస్య
కిం భద్రం భవతి జనస్య మాదృశస్య'

అని లక్ష్యము చెప్పినారు. కోలచల మల్లినాధ సూరి పుత్రుండగు కుమారస్వామి సోమయాజి రచించిన రత్నాపణవ్యాఖ్య (ఈ సందర్భమున నిట్లున్నది)—

“ఛందోభగ్నమితి. భగ్నం ఛందో వృత్తం యత్ర తచ్ఛందో భగ్నమ్. యతి ర్విచ్ఛేద ఇతి ఛాందసాః. భ్రష్టా యతి ర్యత్ర తద్యతి భ్రష్టమ్. ఉభయత్ర వాహితాగ్న్యా దిష్వితి పరనిపాతః. వింధ్యారణ్యేతి. తృతీయవర్ణే యతిభంగః. ప్రహర్షిణీ వృత్తే తృతీయ దశమ వర్ణయోః విభేదో నిహితః. తదుక్తం వృత్తరత్నాకరే— 'మ్నౌజ్రే గస్త్రిదశ యతిః ప్రహర్షిణీయం' ఇతి. తత్ర తృతీయ వర్ణే పరభావా ద్యతి భ్రష్టమ్. పాదాంతవర్ణస్య గురుత్వాభావా చ్ఛందో భగ్నశ్చ. నను క్వచి దవసానేపి 'లఘ్వంత్య' మితి వచనేన గురుత్వ విధానా దత్రాపి గురుత్వాంగీకారే న చ్ఛందో భగ్న ఇతి చేత్, సత్యం. య త్రేంద్రవజ్రోపేంద్రవజ్రాదౌ పాదాంత వర్ణస్య లాక్షణిక గురుత్వేపి ళ్రావ్యత్వ భంగాభావ స్తత్ర మాభూ చ్ఛందోభంగః. ప్రహర్షిణీ, వైతాలీయ, వసంతతిలకాదౌ తు వైపరీత్యా దస్త్యేవ దోష ఇతి ప్రాచీనా:"

పాదాంత లఘువు వికల్పముగా గురువగు ననగా కావలసినపుడు గురు వగునని యర్థముగాని, కొన్ని వృత్తముల కగునని, కొన్ని వృత్తములకు కాదని అర్థముకాదు. లాక్షణిక మతమును ప్రతికూలించి ఆలంకారికులు ఛందోభంగమని చెప్పరాదు. వ్యాఖ్యాకారులును పరిశీలించనిది ప్రహర్షిణి వసంతతిలకాదు