పుట:Sukavi-Manoranjanamu.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టికి రామునకు అనికద్దుగనుక, 'రామునకు' అన్నచోట నికారముగాక నకారము వచ్చుచున్నది. దానికి లోపములేదని 'రాముకు' అని అనరా దన్నారు.

నూత్నదండి ఆంధ్రభాషాభూషణమునందు
క.

సుతుఁ గనియె సుతుని గనియెన్[1]
సుతుచేతన్ సుతునిచేత సుతునకు నిచ్చెన్
సుతు కిచ్చె సుతునివలనన్
సుతువలనన్ సుతునిధనము సుతుధన మెలమిన్.

422
(69) అని చెప్పినాడు గనుక —
సభాపర్వము (3-196)
సీ. పా.

సహదేవ నకుల వాసవసుత భీమ ల
             గ్రమమున నలువురఁ గౌరవేంద్రు
కొక్కొక్కయేటున నుక్కినంబున నొడ్డి
             యోడి తన్నును నొడ్డియోటువడిన......

423

అనిన్ని మహాకవి లక్ష్యము మరియును వ్రాసినారు.424

విరాటపర్వము (5-342)
ఉ.

అత్తఱి లేచివచ్చి తన యన్నలఁ దమ్ములఁ గానుపించె న
య్యుత్తరు కర్ణునుండు వగనొందఁగ నప్పుడ బిల్వఁబంచె (మా
త్స్యోత్తము డార్యమిత్ర సచివోత్కర సోదరవర్గ పుత్రకో
దాత్త భటాది యోగ్యుల ముదంబునఁ బాండవదర్శనార్థమై).

425

అచ్చు పుస్తకములందు 'ఉత్తరకు' అని వ్రాసినారు. మరికొంత గ్రంథమైన పిమ్మట గాని యుత్తర కథ రాదు. ఇచ్చట సందర్భమున్ను లేదు. జనకునితో పుత్రుడు చెప్పుచున్న కథ గావున పొరపాటుగాని, సుష్ఠువుగాదు.426

  1. ము. ప్ర. 'సుతుఁడు సుతు సుతునిఁ గనియెన్...