పుట:Sukavi-Manoranjanamu.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'అగ్రజు'
అరణ్యపర్వము (5-334)
చ.

అనుపమతేజుఁ డున్నతభుజాగ్రుఁడు దుర్జనవైరి విగ్రహుం
డనఘుఁడు వాయుసూనుఁడు నిజాగ్రజుఁ జేసిన సత్యపాశబం
ధనమున (జిక్కి తత్సమయతత్పరుఁడై యిటు ఘోరదుఃఖవే
దనములు సైచెఁగాక మది తద్దయుఁ గ్రోధమయంబు వానికిన్).

418
'అనుజు'
విరాటపర్వము (5–81)
గీ.

అపుడు రాధేయుఁ డమ్మెయి ననుజు వడుట
చూచి (యేనుంగునకు సిళ్లు చూపినట్లు
కవిసి హయములు మత్స్యభూకాంతుతనయు
నేసి పండ్రెండు శరముల నేసె నరుని).

419

కొన్ని విభక్తి రూపముల విచారము

తిమ్మకవి సార్వభౌమడుగారు లక్షణసార సంగ్రహమునందు (1-353)
గీ.

కూర్చియను ద్వితీయకును నొక్కషష్ఠికిఁ
బై విభక్తి గానఁబడఁగ రాక
యడఁగియుండుఁ గృతుల నాచార్యుఁ బ్రణమిల్లె
రాజుకొడు కనంగ రాజమకుట!

420


గీ.

లలిఁ దృతీయాదులగు విభక్తులకు నెల్లఁ
గలుగు మధ్య నకారంబు, దొలఁగుచుండు
రాముచే రాముకొఱకు శ్రీరాముకంటె
రాముకును రామునం దని రాజభూష! (1-363)

421

'టాదివిభక్తా నిర్నేత్యేకే' అని శబ్దశాసనసూత్రము గలదు. దానికి తృతీయాది విభక్తులందు నికారానకు లోపము వచ్చి రాముచేత, రాముకొఱకు, రామువలన, రాముకు, రామునం దని బాలసరస్వతిగారు వ్యాఖ్య వ్రాసినను కొందరు