పుట:Sukavi-Manoranjanamu.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


(జేసికొనంగఁ జేర్చి కడుఁ జిక్క గబట్టి సురారి నేలకున్
వేసిన వెంటనే యెగసి వ్రేసెఁ దటాలునఁ జెంప లాతఁడున్).

392
ఎఱ్ఱనగారి రామాయణము
ఉ.

అంగముతోడఁ గట్టు మిఁక యజ్ఞవిఘాతకచోరు నెందు వో
వంగలవాఁడ వింక నిటు వైళమ తాపసవేషధారివై...

393

'చైపులసాకిరి చాయమగడు' అని ఆంధ్రనామసంగ్రహము నందున్నది. పొరపాటని తిమ్మకవి సార్వభౌముడు 'లక్షణ సారసంగ్రహము, (2-441) న వ్రాసినారు.394

నూత్నదండిగారు
క.

మల్లెయు లంజెయు గద్దెయు
నొల్లెయు నను పగిది పలుకు లొప్పవు గృతులన్
మల్లియ లంజియ గద్దియ
నొల్లియ యని వలికిరేని యొప్పుం గృతులన్.

395

(77) అనిన్ని, వేదాలు, వాదాలు— ఈ మొదలైనవి గ్రామ్యపదములనిన్ని ఆంధ్రభాషాభూషణమందు (26) చెప్పినారు.[1] 'ఎదంతవాచనామ్నా మన్యతర స్యామియాంతానామ్' అని నన్నయభట్టుగారి సూత్రమున్నందున మల్లె-మల్లియ; లంజె-లంజియ; గద్దె-గద్దియ (ఒల్లె-ఒల్లియ) అని రెండువిధములు గలవు.396

'మల్లె'
వసుచరిత్రము (3-129)
రగడ.

మూలమూలల మల్లె లెంతటి మోహమో హరిణాక్షి డాచితి
యేల యేలకి పొదలు వెదకెద వింతవింతలె యెందుఁ జూచితి

397
  1. 'వేదాలు, వాదాలు' గ్రామ్యమని ఆం. భా. భూ. నందు లేదు. ‘యేదాలు, వోదాలు' గ్రామ్యమని యున్నది. ‘... యేగ గొంటూ రమ్ము యేదాలు వోదాలు మోసేటివా రాస సేసు వారు...' ఆం. భా. భూ. 26.