పుట:Sukavi-Manoranjanamu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పగి; గొజ్జంగ–గొజ్జంగి-గొజ్జెగ; వే-వేయి-వెయ్యి-వెయి; నే-నేయి-నెయ్యి-నెయి; చే-చేయి-చెయ్యి-చెయి, ఈ మొదలగు భేదములు గలవు.384

'వే'
శ్రీనాథుని నైషధము (4-25)
గీ.

(స్మరశిలీముఖ కుసుమకేసరపరాగ
ధూళిపాళిక చుళుకించెఁ దూర్పుదిక్కు)
ఇంతి వే గన్నులను గానఁ డింద్రు డిపుడు
నీ విలాసంబు పెంపు వర్ణింపఁ దరమె?

385
'నే'
ఉద్యోగపర్వము (2-243)
క.

నావుడు సంజయుఁ డిట్లను
దేవా పాండవులయలుక ధృష్టద్యుమ్నుం
డే వెరవుమాట నైనన్
నే వోసిన యగ్నివోలె నిగుడం జేయున్.

386
గ్రంథవిస్తరభయమువలన (అన్నింటికి) లక్ష్యము లుదాహరించలేదు. 387
'కోయిల-కోవెల' (అని రెండున్నవి.) కోయిలకు సులభము. 388
‘కోవెల'
రాజశేఖరచరిత్ర (3-80)
సీ.

ఎలమామి కొనయెక్కి పెళ పెళనార్చి కో
వెలపోటు గూకలు వెట్టెనేని......

389
తిమ్మకవి శివలీలావిలాసము
గీ.పా.

విశ్వరూపంబు దాల్చి కోవెలలు నలులు.......

390
'వేళమ-వైళమ' (రెండు గలవు)391
‘వేళమ'- 'వైళమ'
రామాభ్యుదయము (7-250)
ఉ.

వ్రేసిన వ్రేటునం బడక వేళను దాటి పిరిందికంటి బా
హా సముదాయ మధ్యమున కర్కతనూభవునిం దగుల్పడన్