పుట:Sukavi-Manoranjanamu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'గండపెండరము '
తిమ్మకవి అచ్చతెలుగు రామాయణము (యు. 203)

పొసఁగ నౌదలల హొన్బొమిడికమ్ములు పూని
డాకాల గండపెండర మమర్చి...

378
‘హొన్ను' అనుటకు 'హొన్' అని యున్నది. 379
'చవువంచి'
అందే (యు. 184)
సీ. పా.

కాలరిపౌజు వెక్కసపు టేర్పుల జంట
చవువంచి కటలును బెవడువడఁగ ...

380

'పసిడి బంగరు బంగారు పైడిహొన్ను, జాలువా పుత్తడి యనంగ స్వర్ణ మొప్పు' అని ఆంధ్రనామసంగ్రహము (స్థావర. 35) న చెప్పినారు గాని, 'బంగారము-బంగరము-బంగరువు'—అనిన్ని కలదు.381

'బంగారము'
శ్రీనాథుని కాశీఖండము (1-17)
గీ.

కలిగె పదియాఱు వన్నె బంగారమునకుఁ
బద్మరాగంబు తోడ సంపర్కలబ్ధి
(కాశికాఖండ మను మహాగ్రంథమునకు
నాయకుఁడు వీరభద్రభూనాథుఁ డగుట)

382
'బంగరువు'
అందే (7-40)
సీ. గీ.

గురుతనూభవ నాకు బంగరువు తోడ
వజ్రభూషలు సేయు తాల్పంపవలయు
(ననుచుఁ బ్రార్థించి రందఱ కతడు మ్రొక్కి
యిన్నియును దాను కల్పింప నియ్యకొనియె.)

388

పూ-పూవు-పువు-పువ్వు; దౌ-దౌవు-దవు-దవ్వు; మామిడి-మావిడి; కేళా-కూళి; మోసాల-మొగసాల-మోసల-సావడి; సంపెంగ-సంపంగి-సంపెగ - సం