Jump to content

పుట:Sukavi-Manoranjanamu.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉద్యోగపర్వము (1-208) —
క.⁠

కావున మీపడిన యర
ణ్యావాసక్లేశమునకు నజ్ఞాతవిధిన్
సేవకుల రైనదానికి
నోవకుఁడీ మీరు లఘుమనోవృత్తులరే.

⁠ 327

నోవ, చావ, వెఱవ, మఱవ - ఈ మొదలైన పదముల వకారములు (కొన్నిచోట్ల) లోపించును.328

(నోవన్ + ఏయ =) 'నోనేయ' —
ద్రోణపర్వము (4-198) —
గీ.⁠

బలము లచ్చెరువంద నట్లలవు మెఱసి
నీ సుతుం డనిలజుఁ దాకి నిశితసాయ
కముల నొప్పించి రథతురంగముల నొంచి
సూతు నోనేయఁ గ్రోధవిస్ఫూర్తినపుడు.

⁠ 329
(లేవన్ + ఎత్త = ) 'లేనెత్త' —
కవుల షష్ఠము —
మ.⁠

తనతో నల్గిన వాణిపాదములమీదన్ వ్రాల లేనెత్తి నొ
య్యనఁ బాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగఁ జతుర్ముఖత్వము ఫలింపం జోక్కు పద్మాసనుం
డనవద్యాయురుపేతుఁ జేయు చికతిమ్మాధీశుఁ దిమ్మాధిపున్.

⁠ 330
(చావన్ + ఓప =) 'చానోప' —
అరణ్యపర్వము (2-127) —
క.⁠

నాలుగు దిశలను దాన
జ్వాలావలి గదిసె మ్రంది చానోపఁ గృపా
లోలా నన్నొక్క సరి
త్కూలము చేరంగ నెత్తికొని పొమ్ము దయన్.

⁠ 331