పుట:Sukavi-Manoranjanamu.pdf/455

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘మానం' అని అహోబల పండితులవారు నిశ్చయించుటకు కారణమేమిటో తెలియదు మంచిదే. ఇది అధర్వణ కారిక చేతనే వచ్చెననుకుంటే, క్రోడ, వ్రీడాది శబ్దములు ఆకారాంతములు, హ్రస్వములుగా నుండుటకు తను, చంచ్వాది శబ్దములు హ్రస్వముగా నుండుటకు ఎవరికారిక (కారణమో) తెలియదు. 200

కోశాదులందున, వ్యాఖ్యానాదులందున పరిశీలించి కొన్ని కొన్ని శబ్దముల (రూపములు) వ్రాసినాము. కొన్ని కొన్ని శబ్దములకు లక్ష్యములు వ్రాసుతాము.201

చిబుకము ఇత్యాది యగుటకు
భాగవతము అష్టమస్కంధము
సీ.గీ.

వందీ వ్రాలి కుంది వాడిన యిల్లాలి
వదనవారిజంబు వడువు చూచి
చేఱఁదిగిచి మగువ చిలుకంబు పుడుకుచు
వారిజాక్షి యేల వగచె దనుచు.

202
శ్రీనాథుని నైషధము (3–179)

అబ్జగర్భుండు సుషమాసమాప్తియందు
నెత్తి చూడంగఁబోలు నీయింతి వదన
మంగులీయంత్రణక్రియాభంగి నమరి
చిబుక మొనరించెనా నిన్ను సీమసంధి.

203

లేఖకులు ‘చుబుక’ మని పుస్తకములందు వ్రాసినారు. అది లేఖకప్రమాదము. భానోజీ దీక్షితులుగారు తమ అమరసుధావ్యాఖ్యయందుః -

“చివతి చివ్యతే వా, చివ్వ ఆధాన సంవరణయోః
మృగవ్యాధిః స్వార్థే కిన్. చినోతి శుభం వా ప్రాగ్వత్.
'అధస్తా దధరోష్ఠస్య, చిబుస్యా చ్చిబుకం తథా।' ఇతి నిగమః"

అని వ్రాసినారు. ఇక 'గురుబాలప్రబోధిక' యందు—

'చీయతే త్వఙ్మాంసాదిభి రితి చిబుకం. చిఞ్ చయనే.'

అని వ్రాసినారు. 'శబ్దార్థకల్పతరువు' నందు చాదులు ఇత్వాదులు (నైన పదములందు)