పుట:Sukavi-Manoranjanamu.pdf/454

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అ. న.; మానసం- అ, న.; వయః-స, న.; వయసః-అ. న.; మహః- స, న. మరియు అ. పుం.; విహాయసః-స. న; విహాయః- అ. పు; కర్మా-న, పుం.; తమః-అ. పుం. = రాహుగ్రహము; తమం - అ.న.= అంధకారము తమా-ఆ. స్త్రీ = రాత్రి తమీ-ఈ. స్త్రీ = రాత్రి, తమః స.న. =తమోగుణము, దైన్యము, అంధకారము, శోకము, మోహము, లాంఛనము, వక్షఃస్థలము. తనూః-స.పుం.= అరవము, ధూలి. అస్మి= అహమర్ధమందు అవ్యయము, 'అయితిని' అనుట యందు క్రియాపదము.

‘దాసే కృతాగసి భవత్సుచితః ప్రభుణాం
పాదప్రహార ఇతి సుందరి నాస్మి మాయే'

అని భారవి ఘంటాపథమందు వ్రాయబడినది. ధనంజయవిజయమునందు

'ప్రాసాద సంనమదధారకపోలభాషాః
తేజోభిః కనక నికాష రాజి గౌరైః'

'నికషణం - నికషోపలో వా.' అనియున్నది. ఇక :

‘హ్లాదీ సుఖే చేత్యాకారక ధాతూత్పన్నః కహ్లారశబ్దః ఏతచ్చ లింగాభట్టీయాదౌ ద్రష్టవ్యమ్, కల్హార శబ్దస్తు 'హ్లేర్హాః' ఇత్యాకారక ప్రాకృతీయ సూత్రేణ రూప నిష్పత్తి రితి బోద్ధవ్యమ్. ఏతచ్చ మణిదర్పణాదౌ ' ద్రష్టవ్యమ్'

199

గీర్వాణ శబ్దము 'కహ్లార' మని, ప్రాకృత శబ్దము 'కల్పార' మని తత్తద్ వ్యాఖ్యానాదుల వలన స్పష్టముగా కనుపించుచున్నది. వినిమయముగా సంస్కృతశబ్దముకు వాడుకగలదు. ప్రాకృతశబ్దమైన కల్హార శబ్దమును సంస్కృతముగా వాడుకచేసుటకు కారణము కనుపించదు.

'చిబుకం - చిబూకం - చీబుకం - చిబుః అని నాలుగు విధములు గలదు. అందఱు పండితులును 'చుబుక' మంటారు. (చకారమునకు) ఉత్వమని, కోశకారులు చెప్పలేదు. లింగభేదము, అంతభేదము, వచనభేదము, రూపభేదము, కలిగి ఏకశబ్దమే ఏకార్థమందే కోశాదులందున మహాకావ్యములందున ననేకశబ్దములుండగా ఈకారాంతము ఇకారాంతము గావడమకు అధర్వణాచార్యకారికే