ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'రవళి' శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
పినవీరభద్రుని శాకుంతలము (2-184) —
మ. | నవలావణ్యపయోధిఁ జిత్త మను మంథానాద్రికిం జంద్రికా | 112 |
యయాతిచరిత్రము (4-154) —
సీ. పా. | ఎల్లప్పుడును బిక్కటిల్లు బేరులమ్రోత | 113 |
రవరవలు శకటరేఫ మన్నారు. రేఫ మగుటకు—
చేమకూరవారి విజయవిలాసము (1-85) —
క. | రవరవలు నెరపు నీలపు | 114 |
'కచ' పదము బహువచనమేగాని ఏకవచనము గలుగదు. ఉత్తరార్ధమందు రీతియను గుణమున్నది. 115
రొమ్ము, చేరెడు, పరువంపుఁబువ్వు, సురసుర-(వీటిని) శకటరేఫము లన్నారు. 116
'రొమ్ము' రేఫ మగుటకు —
రంగనాథరామాయణము —
ద్విపద. | నీ రొమ్ముగొనికాడ నేర్తునా చూడ | 117 |