పుట:Sukavi-Manoranjanamu.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆదిపర్వము (4-19)
క.

కాఱడవిఁ బఱచు మృగముల
నూఱటకుం దిగిచి డస్సి యున్నతని శ్రమం
బాఱఁగ నెద పరితాపము
దీఱఁగఁ బై వీచె నన్నదీపవనంబుల్.

18
(అను) నీ పద్యము మాత్రము బాగున్నది. కాని, శాంతిపర్వము (1-13) :

కౌరవులు సేయు నవమతి
కారణమునఁ గోపమెత్తు కర్ణుని వదనాం
భోరుహముఁ గనుఁగొనఁగ శ్రమ
మారు న్నా వశముగాక యంతన బుద్ధిన్.

19
అని వ్రాసినారు. 'ఆరుట' అను పదము నిండుటకు నడగుటకు నర్థము. 'నిండె'నను నర్థమైనపుడు రేఫము, అణగు నను నర్థమైనపుడు ఱకారము. ఆప్రకారముగా నొకర్థమైనపుడు రేఫము, నొకర్థమైనపుడు ఱకారమునగు పదములు పెక్కుగలవు. ముందు ముందు కొన్ని తెలియపరచుతాము. (అర్థభేదముచే భిన్నరేఫము లగునను నీ యంశము) నెఱుంగక, 'శమించుట' కర్థమనియు, రేఫ ఱకారముల రెంటను గలదనుటయు భ్రాంతత్వము. క్రిందటి రెండు పద్యముల(ందు)వలె భ్రాంతత్వము (ఇచ్చట) సులభముగా తెలియదు. ఈ పద్యమందు ‘శ్రమ మారున్' అని యుంటే అర్థము కుదురదు. దుర్యోధనాదులు సేయు నవమతిచేత కోపము ప్రజ్వరిల్లుట సరే, కర్ణుని ముఖము గనుగొంటే 'శ్రమ పోయె” నని చెప్పుట ‘పృష్ఠతాడనము-దంతభంగము' అను సామ్యముగా నున్నది. సామ్యమేమి "కౌరవావమతిచేత క్రోధోదయ మయీది, తత్క్రోధముచే శ్రమోదయ మయీది, కర్ణముఖావలోకనమున తచ్ఛ్రమము పోయీది[1]'— ఈ లాగున ననరాదా!" అంటే యీ యర్థము బాగులేదు. (ఇది) మూలమునకు విరోధించినదిన్ని, అసందర్భమైనదిన్ని. ఇట్టి యర్థము పండితులు చెప్పరాదు. (ఎందుకనగా వ్యాసభారతము) శాంతిపర్వము ప్రథమాధ్యాయమునందు——
  1. అయీది, పోయీది అనునవి, అయ్యెడిది, పోయెడిది అను పదములకు వికృతి రూపములు. (వ్యాకరణపరిభాషలో గ్రామ్యరూపములు)