ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ. | శ్రీ కామెపల్లి పురీ గోపికాజార | 4 |
అనిచెప్పి, రేఫముల కొకసీసమాలిక, ఆకారముల కొకసీసమాలిక చేసినారు. రెండును పరిశీలించితే, రేఫములందు ఱకారములును, ఱకారములందు రేఫములును గలసినవి. ఉభయరేఫములని వ్రాసినవి ఉభయరేఫములుగావు. 5
"అరుగుట-పోవుట, చెఱచుట, తెఱఁగులు, తొఱఁగుట, తోఱలుట, నెరసులు విస్తరించుట, పరిగొనుట, పరిచనుదెంచుట, పరిమెయి, పరవకటి, పరిమార్చుట, పెరుగుట, క్రమ్మఱ, మఱదలు – ఇవి కుఱుచలమీఁది రేఫ, ఱకారములు రెండు నగును. 6
ఆరుట = శమించుట, తీరనికినుక, తీరులు, పోర నీరయిపోవుట, మారి మసఁగుట, వేమారు – ఇవి దీర్ఘములమీది రేఫ, ఱకారములు అని వ్రాసినారు. (మరియు) 'అరుగుట' గురురేఫ మగుటకు (ఉదాహరణముగా)—
మౌసలపర్వము (1-169) —
క. | మఱునాఁడ యగుట లెస్సగ | 7 |