పుట:Sukavi-Manoranjanamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అచ్చుకు
మనుచరిత్రము (2-39)
ఉ.

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటిఁజరించె దోటు లే
కివ్వనభూమి భూసురుఁడ నేఁబ్రవరాఖ్యుఁడఁ ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పఁగదవే[1] తెరువేది శుభంబు నీకగున్.

431
'తెల్పఁగదవే' అనుచోట 432
22. 'శంక', అచ్చుకు
ఆముక్తమాల్యద (2-42)
శా.

దానత్యాగపతత్రియై తొలుత పత్రం బంబుధారన్ సదా
నానందత్సితకీర్తిహంసి జనుమింటం గ్రొత్తనా నేల నా
నా నీరార్ద్ర పతత్రి యయ్యు వడి మింటం బాఱు తజ్జాతి కే
లా నిల్చుంగతి యన్యపత్రిగతి పత్త్రైకప్రదేశాప్లుతిన్.

433
‘ఏలా' అని శంక. 'పత్త్రైక' వృద్ధియతియును గలదు. రెండవ మూడవచరణములందు ననునాసికయతులు. 434
23 'అంగీకరణ కృతి', అచ్చుకు
అనుశాసనికపర్వము (3-114)
సీ.

సిరి ధేనువులలోని కలిగిన నెవ్వతె
             వనియని యడిగిన నమ్మహాత్మ
శ్రీ నేను మీలో వసింపఁగా వచ్చితి
             ననవుడు చంచలవైన నిన్ను

  1. తెల్పగదవే' అన్నది ప్రార్థన కావచ్చును.